అన్వేషించండి

Ajay Jadeja : జామ్‌నగర్ సంస్థానం వారసుడు అజయ్ జడేజా - రాజ్యం లేకపోయినా రాజే !

Cricketer Ajay Jadeja : క్రికెటర్ అజయ్ జడేజా గురించి తెలియని వాళ్లు తక్కువ. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్‌మెన్. ఇప్పుడు ఆయన ఓ సంస్థానానికి వారసుడు అయ్యాడు. త్వరలో మహారాజ్ కానున్నారు.

Former Cricketer Ajay Jadeja Named Heir To Jamnagar Throne :  2020లో క్రికెట్‌లో సూపర్ స్టార్లు ఎవరంటే ఖచ్చితంగా గుర్తుకు వచ్చే పేరు అజయ్ జడేజా. ఎన్నో సార్లు గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడి గొప్పవిజయాలు టీమిండియాకు తెచ్చి పెట్టారు. ఆయన ఇప్పుడు జామ్ నగర్ రాజ కుటుంబానికి వారసుడిగా ఎంపికయ్యాడు.   ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్‌జీ దిగ్విజయ్‌సింహ్‌జీ అజయ్ జడేజాను అధికారికంగా దసరా పర్వదినం సందర్భంగా ప్రకటించారు. "  పాండవులు 14 సంవత్సరాల అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రోజు అయిన  దసరా పర్వదినం సందర్భంగా అజయ్ జడేజాను రాజ కుటుంబానికి వారసుడిగా, నవానగర్‌కు తదుపరి జాం సాహెబ్‌గా ప్రకటిస్తున్నాము. నా వారసుడిగా అతడు  సింహాసనాన్ని అధిష్టిస్తాడు" అని దిగ్విజయ్ సింహ్ జీ ప్రకటించారు.  

క్రికెట్‌కు ఎంతో చేసిన జామ్ నగర్ రాజా కుటుంబం 

రంజీ ట్రోఫి, దులీప్ ట్రోఫీలకు ఆ పేర్లు జామ్ నగర్ రాజుల కారణంగానే వచ్చాయి. రంజీ ట్రోఫికి ఆ పేరును జామ్ నగర్ రాజ వంశీకుడు అయిన K.S.రంజిత్‌సింహ్‌జీకి గుర్తుగా పెట్టారు. దులీప్ ట్రోఫీని అదే వంశానికి చెందిన  K.S. దులీప్‌సింహ్‌జీ పేరు పెట్టారు. ఊరకనే వీరి పేరు పెట్టలేదు. భారత్ క్రికెట్‌కు ఈ రాజకుటుంబం అందించిన అండదండలకు గుర్తుగా, గౌరవంగా వారి పేరు  పెట్టారు.  అజయ్ జడేజా కూడా ఈ కుటుంబానికి చెందిన వారే. క్రికెట్‌ పట్ల ఆ కుటుంబంలో ఉన్న ఆసక్తి అజయ్ జడేజాకూ వచ్చింది. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగారు. 

టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్

అంతర్జాతీయ క్రికెటర్‌గా జడేజా రాణింపు
 
1990లో భారత క్రికెట్‌ చూసిన గొప్ప క్రికెటర్లలో జడేజా ఒకడు.  1992 నుంచి 2000 వరకు 15 టెస్టులు, 196 వన్డేల్లో భారత జట్టుకు అజేయ్‌ ప్రాతినిథ్యం వహించాడు. ముఖ్యంగా 1996 వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పాక్‌పై జడేజా ఆడిన ఇన్నింగ్స్‌ సగటు క్రికెట్‌ అభిమానికి ఇప్పటికి గుర్తుండి ఉంటుంది.  జడేజా కేవలం 25 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అందులో  40 పరుగులు దిగ్గజ పేసర్‌ వకార్ యూనిస్ వేసిన చివరి రెండు ఓవర్లలో వచ్చాయి. తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగా ఆటకు దూరమయ్యారు. ఆ ఆరోపణలు తేలిపోయినా మరోసారి క్రికెట్ వైపు చూడలేదు.                                       

యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!

కిరీటం లేకపోయినా వారసత్వంగా మహారాజ్ 

అజయ్ జడేజా రాజకీయ నాయకురాలిగా ఉన్న  జయా జైట్లీ కుమార్తెను వివాహం చేసుకున్నారు.  దిగ్విజయ్ సింహ్ జీ తరవాత నవానగర్ గా పిలిచే జామ్ నగర్ సామ్రాజ్యానికి మహారాజు అవుతారు. ఇప్పుడు రాచరికాలు, సంస్థానాలు లేవు కానీ.. నవానగర్ రాజకుటుంబం మాత్రం వారసత్వం ప్రకటిస్తూనే ఉంటోంది.    

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
AP Local Body Elections: కొలిక్కిరాని చర్చలు.. నేడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ- చంద్రబాబుతో మాధవ్‌ సమావేశం
కొలిక్కిరాని చర్చలు.. నేడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ- చంద్రబాబుతో మాధవ్‌ సమావేశం
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Embed widget