Kohinoor Part 1: యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!
Kohinoor: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఈసారి యాక్షన్ మోడ్‌లోకి రానున్నారు. ‘కోహినూర్ పార్ట్ 1’ పేరుతో రానున్న ఈ చిత్రానికి ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేమ్ రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
Siddhu Jonnalagadda New Movie: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత సంస్థ సూర్యదేవర నాగవంశీలది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్‌లో వచ్చిన 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' చిత్రాలు ఎంత సంచలనాలు సృష్టించాయో చెప్పక్కర్లేదు. ‘టిల్లు స్క్వేర్’ అయితే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో కొత్త సినిమా రానుంది.
‘టిల్లు 3’ కాదు ‘కోహినూర్ పార్ట్ 1’...
అయితే ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ‘టిల్లు 3’ అయితే కాదు. కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం అనే అంశంపై ‘కోహినూర్ పార్ట్ 1’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. పేరును బట్టి ఇది ఫ్రాంచైజీ తరహా సినిమా అని చెప్పవచ్చు. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేమ్ రవికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2026 జనవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు.
భారతీయ సినిమా చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఊహించని కథాంశంతో సినిమా చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. "కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం" అనే కథాంశంతో ‘కోహినూర్ పార్ట్ 1’ రూపొందనుంది. ఇది ఒక సోషియో ఫాంటసీ సినిమా అని నిర్మాతలు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రవికాంత్ పేరేపు, సిద్ధు జొన్నలగడ్డ కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ మంచి హిట్ అయింది.
ఈ సినిమా కథాంశమే కాకుండా, కథనం కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండనున్నాయని నిర్మాతలు అంటున్నారు. న్యాయంగా మనకు చెందాల్సిన వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చి, శతాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికి, చరిత్ర సృష్టించడానికి స్టార్ బాయ్ సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంతో ఐకానిక్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్‌ను అందిస్తామని అంటున్నారు. ఈ సినిమాని అత్యంత భారీస్థాయిలో, ప్రపంచస్థాయి సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ ఎత్తున ‘కోహినూర్ పార్ట్ 1’ సినిమాను నిర్మిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Also Read: మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న సిద్ధు...
సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘జాక్’లో స్టార్ బాయ్ ఈసారి స్పై అవతారం ఎత్తనున్నారు. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీని షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
నీరజ కోన దర్శకత్వంలో ‘తెలుసు కదా’ అనే రొమాంటిక్ కామెడీలో కూడా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా, కేజీయం ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?