Haldia Refinery Fire: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందారు.
బంగాల్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 40 మందికి పైగా గాయపడ్డారు.
West Bengal | 3 people died, over 30 persons were injured in a fire incident at IOCL refinery in Haldia today. The injured have been shifted to Kolkata: SK Ajgar Ali, Chairman-In-Council, Haldia Municipality pic.twitter.com/W9qge0c0Ub
— ANI (@ANI) December 21, 2021
పూర్వ మెదినీపుర్ జిల్లాలోని హల్దియా ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో 37 మందిని కోల్‌కతాలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రిఫైనరీలోని ఓ యూనిట్ మూసివేత పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఐఓసీ ఓ ప్రకటనలో తెలిపింది.
దీదీ దిగ్భ్రాంతి..
West Bengal CM Mamata Banerjee 'deeply anguished' by the fire incident at IOC, Haldia
— ANI (@ANI) December 21, 2021
"...Those injured are being brought to Kolkata through a green corridor. GoWB will extend all assistance to ensure their speedy recovery," CM says. pic.twitter.com/pErzOoRHNX
ప్రమాదంపై బంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు పూర్తి వైద్య సాయం అందిస్తామని దీదీ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు త్వరగా కోలుకావాలని ఆకాంక్షించారు.
Also Read: Goodbye 2021: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!
Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 5,326 మందికి కొవిడ్
Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి