అన్వేషించండి

Musharrafs land : ముషారఫ్ భూమిని అమ్మేసిన భారత ప్రభుత్వం - పాకిస్తాన్‌లో ఉన్నది కాదు ఇక్కడిదే !

Enemy Land : పాక్ మాజీ నియంత పాలకుడు ముషారఫ్‌కు ఇండియాలో ఉన్న స్థలాన్ని ప్రభుత్వ వేలం వేసి అమ్మేసింది. కోటిన్నర పెట్టి ఇతరులు కొనుగోలు చేశారు .

Ex-Pakistan President Parvez Musharraf s land in UP : పాకిస్తాన్ మాజీ మిలటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఇండియాలో ఆస్తులు ఉన్నాయి. వాటిలో ఉన్న ఒక ఆస్తిని ప్రభుత్వం వేలం వేసేసింది. యూపీలోని కొటానా అనే గ్రామంలో ఉన్న రెండు హెక్టార్ల భూమిని రూ. కోటి ముఫ్పై ఎనిమిది లక్షలకు వేలం పాటలో ఇతర వ్యక్తులు దక్కించుకున్నారు. రిజిస్ట్రేషన్ తో కలిపి కోటిన్నర అవుతుంది. 

దేశ విభజన సమయంలో పాకిస్థాన్ వెళ్లిపోయిన ముషారఫ్ కుటుంబం                          

పాకిస్తాన్ మిలటరీ చీఫ్ గా కూడా పని చేసిన ముషారఫ్.. అసలు భారత్ లో ఎందుకు ఆస్తులు కొన్నాడన్న డౌట్ చాలా మందికి వస్తుంది. నిజానికి ముషారఫ్ పుట్టింది ఇండియాలోనే . దేశ విభజనకు ముందు ఆయన ఇండియాలో  పుట్టారు. ఆయన కుటుంబానికి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి. అయితే విభజన సమయంలో ముషారఫ్ కుటుంబం పాకిస్థాన్ వెళ్లిపోయింది. దాంతో ఇక్కడ ఉన్న ఆస్తులన్నీ అలాగే ఉండిపోయాయి. సాధారణంగా ఇలాంటి ఆస్తుల్ని ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించి కేంద్రం స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటి వరకూ ఆ ఆస్తుల్ని కాపాడిన కేంద్రం మెల్లగా అమ్మేస్తూ వస్తోంది. 

సంజయ్‌రాయ్‌కు బెయిల్ ఇచ్చేయమంటారా ? - సీబీఐ ఆలసత్వంపై బెంగాల్ కోర్టు ఆగ్రహం

వారి ఆస్తుల్ని ఎనిమీ ప్రాపర్టీస్ గా ప్రకటించిన కేంద్రం               

ఇదొక్కటే కాదు.. ఎనిమీ ప్రాపర్టీస్ కింద చాలా ఆస్తులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ విభాగం పర్యవేక్షిస్తూ వస్తోది. ముషారఫ్ తాత కొటానాలో నివసించారు.  ముషారఫ్ తండ్రి సయ్యద్ ముషారఫుద్దీన్, తల్లి జరీన్ బేగం ఢిల్లీలోనే నివరసించారు. కానీ ముషారఫ్ తాత స్వగ్రామం మాత్రం కొటానా. అందరూ పాకిస్థాన్ వెళ్లిపోయాక ఆ ఆస్తుల్ని ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు.  2010లో ఎనిమీ ప్రాపర్టీగా కేంద్రం ప్రకటించింది. వేలం వేసిన ఆస్తి.. వ్యవసాయానికి కూడా అంత అనుకూలంగా లేనట్లుగా తెలుస్తోంది.  

బంగ్లాదేశ్ రాజకీయాల్లో సంచలనం, షేక్ హసీనాతో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు

గత ఏడాది చనిపోయిన ముషారఫ్                                                     

1999లో పాకిస్తాన్ లోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి ముషారఫ్ మిలటరీ పాలకుడు అయ్యారు.  2001 నుంచి 2008 వ‌ర‌కు పాకిస్థాన్ అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత పదవి నుంచి వైదొలగాల్సి రావడంతో ఆయన పాకిస్తాన నుంచి  పారిపోయారు. అనారోగ్యం కారణంగా దుబాయ్ లో చనిపోయారు. ఢిల్లీలో కొన్ని వందల కోట్లు విలువ చేసే ఎనిమీ ప్రాపర్టీలు ఉన్నాయని అధికార వర్గాలుచెబుతున్నాయి. వాిని కూడా మెల్లగా వేలం వేసే అవకాశాలు ఉన్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget