అన్వేషించండి

EWS Quota Verdict Highlights: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు- ఏం చెప్పిందంటే?

EWS Quota Verdict Highlights: ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి ఇచ్చే ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

EWS Quota Verdict Highlights: ఈడబ్ల్యూఎస్‌ (Economically Weaker Sections) రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో కల్పించే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని తీర్పు ఇచ్చింది. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ సహా నలుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 

3:2

న్యాయమూర్తుల్లో ముగ్గురు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉంటుందని ప్రకటించగా ఇద్దరు మాత్రం తీర్పుతో విభేధించారు. సీజేఐ యూయూ లలిత్.. జస్టిస్ రవీంద్ర భట్‌తో ఏకీభవించారు. అయితే జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా మాత్రం #EWS సవరణను సమర్థించారు.

సమర్థిస్తూ

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం కోటా (రిజర్వేషన్లు) కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ ఈ పిటిషన్లను కొట్టివేసింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ యూయూ లలిత్‌, జస్టిస్​ దినేశ్​ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్​, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అనేక మంది సీనియర్​ న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్​ యూయూ లలిత్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆరున్నర రోజల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌ కల్పించడమంటే.. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీం కోర్టుకు కొందరు న్యాయవాదులు నివేదించారు. రిజర్వేషన్లపై 50%గా ఉండాల్సిన పరిమితిని అది అతిక్రమిస్తోందని, క్రీమీలేయర్‌ విధానాన్ని ఓడిస్తోందని పేర్కొన్నారు. ఆ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మినహాయిస్తుండటాన్నీ తప్పుపట్టారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించింది. 

ఇదీ చట్టం

ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం 2019, ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చింది. దీంతో వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరుతోందని ప్రభుత్వం చెబుతోంది.

Also Read: Tamil Nadu Bear Attack: బైకర్‌పై ఎలుగుబంటి దాడి- తల కొరికేసింది, వైరల్ వీడియో!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం

వీడియోలు

Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
Smriti In Nets After Wedding Cancellation | బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న స్మృతి మంధాన
SKY about Sanju Samson as Opener | టీమ్ పై కీలక వ్యాఖ్యలు చేసిన SKY
Gambhir about Team India Batting Order | గంభీర్ కొత్త స్టేట్మెంట్ అర్థం ఏంటి..?
Irfan Pathan Comments on Captain Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 1st T20: కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
కటక్‌ టీ20లో సౌతాఫ్రికాపై 101 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా
Andhra Pradesh Latest News: స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
స్క్రబ్ టైఫస్‌పై అధ్యయనానికి వైద్యనిపుణులతో టాస్క్‌ఫోర్స్ నియమించనున్న ఏపీ ప్రభుత్వం
Telangana Rising Summit: సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
సినీ రంగానికి పూర్తి స్థాయి ప్రోత్సాహం - సీఎం రేవంత్ హామీ
Ram Mohan Naidu summons IndiGo CEO: ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
ఇండిగో సంక్షోభంపై ప్రభుత్వం ఆగ్రహం, 10% విమానాలను తగ్గించాలని కఠిన ఆదేశం
Karthigai Deepam Row: ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
ప్రభుత్వం Vs విపక్షాలు Vs కోర్టు - తమిళనాడు రాజకీయాల్లో సెగ రేపుతున్న ఆలయ దీపం
Pilot Rostering Issues: భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
భారత్‌లో పైలట్‌ల కొరతకు కారణాలేంటీ? యువత అటువైపుగా ఎందుకు ఆసక్తి చూపడం లేదు?
IPL 2026 Auction :ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
ఐపీఎల్ 2026 వేలం కోసం ఎంపికైన 350 మంది ఆటగాళ్ల వివరాలు ఇవే!
Dekhlenge Saala Song Promo: 'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
'దేఖ్‌లేంగే సాలా' ప్రోమో వచ్చేసిందోచ్... మైఖేల్ జాక్సన్ స్టైల్‌లో పవర్ స్టార్ స్టెప్పులు - ఫ్యాన్స్‌కు పండగ
Embed widget