By: Ram Manohar | Updated at : 22 Feb 2023 11:15 AM (IST)
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో టెక్నికల్ ఫెయిల్యూర్ కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. (Image Credits: Pixabay)
Air India Emergency Landing:
ఎయిర్ ఇండియా విమానంలో..
ఈ మధ్య కాలంలో తరచూ విమానాల్లో ఏదో సాంకేతిక లోపం తలెత్తుతూనే ఉంది. ఉన్నట్టుండి పొగలు, మంటలు రావడం అత్యవసరంగా ల్యాండ్ అయిపోవడం లాంటివి తరచూ జరుగుతున్నాయి. మరోసారి ఇలాంటి సంఘటనే జరిగింది. అమెరికా నుంచి ఢిల్లీకి వస్తున్న Air India ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా...స్టాక్‌హోమ్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు వెల్లడించారు. అందరూ సేఫ్‌గానే ఉన్నట్టు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ బ్రిగేడ్‌ను పిలిపించింది. ఇంజిన్‌లో ఆయిల లీక్ అయినట్టు పైలట్లు గుర్తించారని అందుకే అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. రెండో ఇంజిన్‌లోని డ్రెయిన్ నుంచి ఆయిల్ బయటకు రావడాన్ని పైలట్‌లు గుర్తించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. అంతకు ముందు ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూడా ఇలాగే అత్యవసరంగా ల్యాండ్ అయింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇలా చేయాల్సి వచ్చిందని వివరించారు అధికారులు. ఇవే కాదు. ఈ మధ్య కాలంలో ఎయిర్ ఇండియా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి రెండు, మూడు సార్లు ఫ్లైట్ టైమింగ్స్ మార్చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే ముంబయిలో ఇదే జరిగింది. రాత్రి 8 గంటలకు బయల్దేరాల్సిన విమానం అర్ధరాత్రి 12.30కి టేకాఫ్ అయింది.
Air India Newark (US)-Delhi flight (AI106) with nearly 300 passengers made an emergency landing at Sweden's Stockholm airport after it developed a technical snag. All passengers safe. A large no.of fire engines were deployed at the airport as the flight made an emergency landing pic.twitter.com/Rdwfg9VOgx
— ANI (@ANI) February 22, 2023
ఇటీవలే..
ఎయిర్ ఇండియా విమానం రూట్ డైవర్ట్ చేశారు. న్యూయార్క్ - ఢిల్లీ విమానం (AI-102)ను అత్యవసరంగా లండన్‌కు మళ్లించారు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా సోమవారం (ఫిబ్రవరి 20) రాత్రి లండన్‌కు మళ్లించినట్లు జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. న్యూయార్క్ లో టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం (AI-102) సోమవారం రాత్రి 11.25 గంటలకు ఢిల్లీకి రావాల్సి ఉంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎయిర్ ఇండియా ఫ్లైట్ నేటి రాత్రి దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కావాలి. కానీ విమానం నార్వే క్రాస్ అవుతున్న సమయంలో లండన్, యూకేకు విమానాన్ని డైవర్డ్ చేశారు. విమానంలో ప్రయాణికుడికి మెడికల్ ఎమర్జెన్సీ కావడంతో ఢిల్లీకి వస్తున్న విమానాన్ని లండన్ కు మళ్లీంచి టేకాఫ్ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 20 (సోమవారం) తెల్లవారుజామున ఢిల్లీ నుంచి దేవ్‌గఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని బాంబు బెదిరింపుతో లక్నోకు మళ్లించారు. బెదిరింపు కాల్ రావడంతో అధికారులు ఢిల్లీ ఎయిర్ పోర్టులో తనిఖీలు చేపట్టగా ఫేక్ కాల్ అని తేలింది. అనంతరం ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఢిల్లీ నుంచి దేవ్ గఢ్ వెళ్లాల్సిన విమానం లక్నో నుంచి టేకాఫ్ అయింది.
Also Read: మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? వారి ‘మెదడు’ను పాడుచేస్తోంది మీరే - ఎంత నష్టమో చూడండి
Bandi Sanjay : సిట్ కేసీఆర్ జేబు సంస్థ, కేటీఆర్ కు నోటీసులిచ్చే దమ్ముందా? - బండి సంజయ్
Breaking News Live Telugu Updates: జేఎల్ పేపర్ 2 తెలుగులోనూ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు
సీయూఈటీ (పీజీ) పరీక్ష షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!
Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?