News
News
X

Election Results 2023: మూడు ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ లీడ్‌,ఉత్కంఠగా ఫలితాల ట్రెండ్

Election Results 2023: ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో మూడు చోట్లా బీజేపీ లీడ్‌లో ఉంది.

FOLLOW US: 
Share:

Election Results 2023:

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటికే త్రిపురలో లీడ్‌లో ఉన్న బీజేపీ...నాగాలాండ్‌లోనూ ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశముందని ప్రస్తుత ట్రెండ్‌ను గమనిస్తే స్పష్టమవుతోంది. మొదట్లో మేఘాలయాలో బీజేపీకి కాస్త తక్కువ సీట్లే వస్తాయని భావించిన క్రమంగా కౌంటింగ్ జరిగే కొద్ది లీడ్‌లోకి వచ్చేసింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇప్పటికే రంగంలోకి దిగి మేఘాలయా ఎన్నికల ఫలితాలను గమనిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే...ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. త్రిపురనే గమనిస్తే...బీజేపీ లీడ్‌లో ఉన్నట్టే కనిపిస్తున్నా...అటు వామపక్ష పార్టీలు కూడా పోటీనిస్తున్నాయి. 60 సీట్లున్న త్రిపురలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 30 సీట్ల మార్క్‌ను సాధించాలి. ప్రస్తుతానికి బీజేపీ IPFTతో కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. ఈ కూటమికి 31 సీట్లు దక్కాయి. లెఫ్ట్ పార్టీలకు 18 సీట్లు వచ్చాయి. తిప్ర మోత పార్టీ (TMP) 12 చోట్ల విజయం సాధించింది. అంటే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే TMP పార్టీ కీలకంగా మారనుంది. చెప్పాలంటే ఇదే కింగ్ మేకర్ అవుతుంది. బీజేపీ కలిసి నడిస్తే మాత్రం NDA ప్రభుత్వమే మరోసారి ఏర్పాటు చేసే అవకాశముంది. ఇక మేఘాలయా విషయానికొస్తే... 59 సీట్లున్న ఈ రాష్ట్రంలో National People's Party (NPP)కి 24 సీట్లు దక్కాయి. బీజేపీకి మాత్రం కేవలం 6 సీట్లు దక్కాయి.  అయితే NDPPతో  నాగాలాండ్‌లో 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. బీజేపీ కూటమికి 41 సీట్లు వచ్చాయి. ఇక్కడ NDA ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది. 

Published at : 02 Mar 2023 11:33 AM (IST) Tags: Meghalaya Election Results Tripura Election Results 2023 Nagaland

సంబంధిత కథనాలు

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

Cyber Crime : కమీషన్ కోసం కక్కుర్తి పడితే అకౌంట్ ఖాళీ, వాట్సాప్ చాటింగ్ తో చీటింగ్!

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్

MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?