Love Story : లవర్ ఆఫ్ ది డికేడ్ .. 40 ఏళ్లకుపైగా నిరీక్షించి ప్రేయసిని పెళ్లాడిన ప్రేమికుడు..!
20 ఏళ్ల వయసులో ప్రేమించిన యువతి కోసం ఒంటరిగా ఉండి 65 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడో పట్టు వదలని ప్రేమికుడు. కర్ణాటకలో ఈ ప్రేమికుడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఒకానొక ఊరిలో ఓ పెద్ద మనిషి ఉంటాడు. అతనికి పెళ్లి కాలేదు. ఎందుకు కాలేదని ఎవరైనా అడిగితే .. పెళ్లి కాలేదు కాదు.. చేసుకోలేదని చెబుతూ ఉంటాడు. చివరికి ఓ రోజు పెళ్లి చేసుకుని వస్తాడు. ఊళ్లో అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అప్పటికి అతని వయసు 65 ఏళ్లు... అతను చేసుకున్న మహిళ వయసు కూడా 60 ఏళ్లు. ఇంత లేటు వయసులో పెళ్లా అని ఆశ్చర్యపోయి అక్కడ యువత అసలు ఈ పెళ్లి గురించి చెప్పమని పట్టుబడతారు. అప్పుడు ఆ తాత అసలు తాము పెళ్లి చేసుకోవడానికి ముందు జరిగిన లవ్ స్టోరీ చెబుతారు. అక్కడ్నుంచి అసలు ఫ్లాష్ బ్యాక్ స్టార్టవుతుంది.
ఆ ఫ్లాష్ బ్యాక్‌లో ఆ యువతి యువకులు వయసులో ఉన్నప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరగడం.. చివరికి విధి వక్రించి... కులమో..మతమో.. ఆస్తులో.. అంతస్తులో ఇంకా కొత్తగా ఆలోచించాలంటే మిస్ అండర్ స్టాండింగ్ లేదా ఈగో ప్రాబ్లమ్స్.. లేకపోతే కెరీర్ ఇలాంటి కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోతారు. అమ్మాయి వెరే వాళ్లతో పెళ్లపోతుంది. కానీ అబ్బాయి మాత్రం ప్రేమించేది ఒక్కసారే.. చచ్చిపోయేది ఒక్క సారే అని తీర్మానించుకుంటాడు.. పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు.
Also Read: Omicron Variant: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
చివరికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఓ సందర్భంలో తన మాజీ లవర్‌ను కలుస్తాడు. అప్పటికే ఆమె నుదుట బొట్టు లేకపోవడం చూసి .. ఏం జరిగిందో తెలుసుకుంటాడు. ఇక ఆమెకు కొత్త జీవితం ఇవ్వాలని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. పెళ్లి చేసుకుని తీసుకొస్తాడు. అదే క్లైమాక్స్. ఇది అచ్చం సినిమా స్టోరీలాగా ఉండవచ్చు కానీ.. రియల్ స్టోరీ. నిజంగానేఇలా పెళ్లి చేసుకున్న ఓ జంట కర్ణాటకలోని మాండ్యం జిల్లా మేలుకోటెలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : మంత్రి గారి శపథం.. కారు ఆపినందుకు ఫైర్.. మళ్లీ అప్పుడే అసెంబ్లీకి వెళతారట!
కర్ణాటకలోని మాండ్యం జిల్లా మేలుకోటెలోకు చెందిన చిక్కణ్ణ.. పద్దెనిమిదేళ్ల వయసులో జయమ్మను ప్రేమించాడు. కానీ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కావడంతో జయమ్మకు వేరే వారితో వివాహం జరిగింది. తాత మాత్రం ఆమె జ్ఞాపకాలనే నెమరువేసుకుంటూ బతికేశాడు. ప్రస్తుతం అతడి వయసు 65 సంవత్సరాలు. అయితే జయమ్మకు వేరే వ్యక్తితో వివాహం జరిగాక తన భర్తను కోల్పోయింది. పిల్లలు కూడా లేరు. ఈ విషయం తెలిసి తన ప్రేమను లేటుగా సక్సెస్ చేసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. దీంతో వీరి ప్రేమను బతికించుకోవడం కోసం సమాజ కట్టుబాట్లను చీల్చుకుని 65 ఏళ్ల వయసులో శాస్త్రోక్తంగా పెళ్లాడి ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Also Read: ఓమ్రికాన్ వేరియంట్ వేళ...ఈ బ్లడ్ గ్రూపుల వాళ్లకే హై రిస్క్, చెబుతున్న ఇండియన్ అధ్యయనం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి