Shubh Muhurat Divorce : మంచి ముహుర్తం రాలేదని పదేళ్లుగా కాపురానికి రాని భార్య.. విడాకులిచ్చేసిన భర్త !

చత్తీస్‌ఘడ్‌లో ఓ భార్య .. భర్త ఇంటికి వెళ్లేందుకు పదేళ్లుగా శుభముహుర్తం కోసం చూస్తూనే ఉంది. ఎప్పుడు రమ్మన్నా మంచి ముహుర్తం లేదని తప్పించుకునేది. చివరికి విసిగిపోయిన భర్త విడాకులిచ్చేశారు.

FOLLOW US: 

ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నాడు. భార్య కాపురానికి వస్తుందని.. ముద్దు ముచ్చట్లతో మురిసిపోవచ్చని అనుకున్నాడు. ఇల్లు రెడీ చేసుకున్నాడు. సుఖంగా సంసారం చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. కానీ భార్య వచ్చే శుభముహుర్తం రాక ముందే డైవర్స్ తీసేసుకున్నాడు. ఎందుకంటే ఆ శుభముహుర్తం ఇక రాదేమోనని ఆ పెళ్లికొడుకు భయపడ్డాడు. చివరికి ఎటూ కాకుండా పోతానని ఆందోళన చెందాడు. అదే విషయాన్ని కోర్టుకు చెప్పాడు. చివరికి విడాకులు తీసుకున్నాడు. 

Also Read: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని

 కోర్టు కూడా మరింత ఆలస్యం చేయకుండా అతనికి విడాకులు ఇచ్చేసింది.ఎందుకంటే భార్య తనతో కాపురానికి వచ్చే శుభముహుర్తం కోసం అతను పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎంత కాలం చూసినా ఆ శుభముహుర్తం ఇంకా ఇంకా లేదని చెబుతూ ఆ పెళ్లి కూతురు పుట్టింట్లోనే ఉండిపోయింది. చివరికి కోర్టులో విడాకుల కేసు వేసినా ఆమె రాలేదు. మంచి ముహుర్తం కోసం చూస్తూనే ఉంది. ఈ లోపు ఆ మంచి ముహుర్తం రాకుండానే కోర్టు విడాకులిచ్చేసింది. ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది. 

Also Read: అమెరికా ఎయిర్‌పోర్టులో మత్తులో రచ్చ చేసి...యూరిన్ పోసింది ఆర్యన్ ఖానేనా ? నిజం ఏమిటి ?

చత్తీస్‌ఘడ్‌కు చెందిన సంతోష్ సింగ్ 2010లో పెళ్లి చేసుకున్నాడు. అప్పట్నుంచి ఆయన  భార్య కాపురానికిరాలేదు. ఎప్పుడు పిలిచినా మంచి ముహుర్తం లేదని.. అది చూసి వస్తానని చెప్పేది. సంతోష్ సింగ్ చాలా ఓపికతో రోజులు.. వారాలు.. నెలలు లెక్కబెట్టుకుంటూ వచ్చారు. ఎన్నేళ్లు గడిచినా ఆమె రావడం లేదు. దీంతో ఏదో తేడాగా ఉందని అనుమానించి .. పదేళ్లు చూసి కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశాడు . వాదనల్లో కూడా ఆ పెళ్లి కూతులు అదే వాదన వినిపించి తనను అత్తవారింటికి తీసుకెళ్లేందుకు శుభముహుర్తంలో తన భర్త ఎప్పుడూ రాలేదని చెప్పింది. 

Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..

ఇరువురి వాదనలు విన్న కోర్టుల శుభముహుర్తం అనేది కుటుంబం ఆనందంగా ఉండేందుకు పెట్టుకునే ముహుర్తం అని ఈ కేసులో మాత్రం వివాహ బంధాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఉపయోగించుకున్నారని తేల్చింది. విడాకులు మంజూరు చేసింది. 

Also Read: RGV Questions AP Govt: వర్మ వదలడం లేదుగా... ఏపీ ప్రభుత్వానికి ఆర్జీవీ సంధించిన తాజా ప్రశ్నలు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
 
Published at : 05 Jan 2022 06:57 PM (IST) Tags: A decree of divorce shubh-mahurat0ime The Chhattisgarh High Court matrimonial home

సంబంధిత కథనాలు

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!

MLC Kavitha: జూన్‌ 4 నుంచి సీహెచ్ కొండూరు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆహ్వానం పలుకుతున్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: జూన్‌ 4 నుంచి సీహెచ్ కొండూరు లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆహ్వానం పలుకుతున్న ఎమ్మెల్సీ కవిత

SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే

SonuSood Foundation :  ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే

Nellore News : నెల్లూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం, మూడు యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

Nellore News : నెల్లూరు థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదం, మూడు యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

టాప్ స్టోరీస్

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!