అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2026

(Source: ECI/ABP News)

CJ Roy Suicide Updates: ఐటీ వేధింపులే ప్రాణం తీశాయా? సీజే రాయ్ ఆత్మహత్యపై సోదరుడి సంచలన వ్యాఖ్యలు

CJ Roy : సీజే రాయ్ ఆత్మహత్య వ్యవహారం ఐటీ అధికారుల మెడకు చుట్టుకుంటోంది. వారి వేధింపుల వల్లే చనిపోయారని ఆరోపణలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.

CJ Roy Brother sensational comments:   బెంగళూరులో రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న కాన్ఫిడెంట్ గ్రూప్ ఛైర్మన్ సీజే రాయ్ మృతి పారిశ్రామిక వర్గాలను షాక్‌కు గురి చేసింది.   ఈ విషాద ఘటనపై ఆయన సోదరుడు సీజే బాబు తీవ్ర ఆరోపణలు చేశారు.   రాయ్ మరణానికి ఆదాయపు పన్ను అధికారుల వేధింపులే కారణమని  స్పష్టం చేశారు.  తన సోదరుడికి ఎలాంటి అప్పులు లేవని, వ్యాపారపరంగా కూడా ఎటువంటి ఒత్తిడి లేదని.. కేవలం గత కొన్ని రోజులుగా ఐటీ అధికారులు పెడుతున్న మానసిక ఒత్తిడి వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేరళకు చెందిన ఐటీ అధికారుల బృందం ఉద్దేశపూర్వకంగానే రాయ్‌ను వేధించిందని ఆయన ఆరోపించారు.  

గత మూడు రోజులుగా ఐటీ అధికారులు రాయ్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నిజానికి రాయ్ తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉండగా, విచారణ పేరుతో అధికారులు ఆయనను బెంగళూరుకు రప్పించినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3:15 గంటల సమయంలో, అధికారులు తన కార్యాలయంలోని ఒక గదిలో రాయ్‌ను ప్రశ్నిస్తుండగా, ఆయన ఫోన్ మాట్లాడాలని పక్క గదిలోకి వెళ్లి తన లైసెన్స్డ్ తుపాకీతో కాల్చుకున్నారు.  తుపాకీ పేలిన శబ్దం విని అధికారులు, సిబ్బంది వెళ్లి చూసేసరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఐటీ అధికారులపై కేసు నమోదు చేయాలని రాయ్ కుటుంబం భావిస్తోంది. తిరువనంతపురానికి చెందిన అడిషనల్ కమిషనర్ స్థాయి అధికారి రాయ్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారని, అన్ని డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ పదేపదే వేధింపులకు గురిచేశారని బాబు పేర్కొన్నారు. ఘటన జరిగిన సమయంలో రాయ్ భార్య లీనా రాయ్, కుమారుడు రోహిత్ దుబాయ్‌లో ఉండగా, సమాచారం అందిన వెంటనే వారు బెంగళూరు చేరుకున్నారు. శనివారం బౌరింగ్ ఆసుపత్రిలో రాయ్ పార్థివ దేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. 

సీజే రాయ్ కేవలం ఒక బిల్డర్ మాత్రమే కాకుండా సినిమా రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. ఇటీవల  ఐడెంటిటీ  అనే  సినిమా నిర్మాణంలోనూ భాగస్వామి అయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఆయన, ఐటీ సోదాల సమయంలో ఇలా ప్రాణాలు తీసుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయాలని పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం పోలీసులు  ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరిస్తున్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Assembly Election Results 2026 Live Updates: బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ.. తమిళనాడులో విజయ్‌పార్టీ ఆధిపత్యం.. అస్సాం బీజేపీదే
బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ.. తమిళనాడులో విజయ్‌పార్టీ ఆధిపత్యం.. అస్సాం బీజేపీదే
Tamil Nadu Election Results 2026: తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!
తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!
Tamil Nadu Assembly Election Results: విజయ్‌దే వేవ్ - కానీ మ్యాజిక్ మార్క్ కష్టం - కలిసొచ్చేదెవరు?
విజయ్‌దే వేవ్ - కానీ మ్యాజిక్ మార్క్ కష్టం - కలిసొచ్చేదెవరు?
West Bengal CM Suvendu Sdhikari: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలు! కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి!
పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలు! కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి!

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Election Results 2026: తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!
తమిళనాడు సీఎంగా విజయ్‌! ఎన్నికల్లో టీవీకే బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్! విజిల్ దెబ్బకు డీఎంకే టాప్‌ఆర్డర్‌ ఢమాల్!
West Bengal CM Suvendu Sdhikari: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలు! కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి!
పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలు! కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి!
Tamil Nadu Assembly Election Results: విజయ్‌దే వేవ్ - కానీ మ్యాజిక్ మార్క్ కష్టం - కలిసొచ్చేదెవరు?
విజయ్‌దే వేవ్ - కానీ మ్యాజిక్ మార్క్ కష్టం - కలిసొచ్చేదెవరు?
Assam Assembly Elections: అస్సాంలో మరోసారి కాంగ్రెస్ అస్సాం- వరుస మూడో సారి అధికారంలోకి బీజేపీ ఖాయమే - ట్రెండ్స్‌లో క్లియర్ లీడ్ !
అస్సాంలో మరోసారి కాంగ్రెస్ అస్సాం- వరుస మూడో సారి అధికారంలోకి బీజేపీ ఖాయమే - ట్రెండ్స్‌లో క్లియర్ లీడ్ !
YSRCP: వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
వైల్డ్ గానే వైసీపీ సోషల్ మీడియా పంథా - మార్పు రాని దండయాత్ర ధోరణి!
Assembly Election Results 2026 Live Updates: బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ.. తమిళనాడులో విజయ్‌పార్టీ ఆధిపత్యం.. అస్సాం బీజేపీదే
బెంగాల్‌లో బీజేపీ, టీఎంసీ మధ్య హోరాహోరీ.. తమిళనాడులో విజయ్‌పార్టీ ఆధిపత్యం.. అస్సాం బీజేపీదే
Telangana Revenue: ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
ప్రజలపై పన్నుల భారం వేయకుండానే ఆదాయం పెంపు: సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం
Woman in Muscat: కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
కాపాడండి అన్న అంటూ మస్కట్‌లో ఏపీ మహిళ కన్నీళ్లు.. స్పందించిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్
Embed widget