By: Ram Manohar | Updated at : 12 Apr 2023 01:13 PM (IST)
ఢిల్లీలోని ఓ స్కూల్‌లో బాంబు పెట్టామంటూ మెయిల్ రావడం కలకలం రేపింది. (Image Credits: ANI)
Delhi School Bomb Threat:
ఢిల్లీలో ఘటన..
ఢిల్లీలోని ఓ స్కూల్‌లో బాంబు పెట్టామంటూ బెదిరింపులు రావడం కలవరం రేపింది. వార్నింగ్ వచ్చిన వెంటనే స్కూల్ యాజమాన్యం అలెర్ట్ అయింది. విద్యార్థులందరినీ బయటకు తరలించింది. సాదిక్ నగర్‌లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కి ఉదయం 10.49 నిముషాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. స్కూల్‌లో బాంబు పెట్టామని బెదిరించారు. ఇది చూసి టెన్షన్ పడిన యాజమాన్యం విద్యార్థులను బయటకు పంపింది. మీ పిల్లల్ని తీసుకెళ్లండి అంటూ తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపింది. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తల్లిదండ్రులు కంగారు పడి స్కూల్‌కు వచ్చారు. బయట విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. "వెంటనే స్కూల్‌కి వచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్లండి అంటూ స్కూల్ నుంచి మాకు మెసేజ్‌లు వచ్చాయి. ఏమైందో అని కంగారు పడిపోయి వచ్చేశాం" అని తల్లిదండ్రులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్కూల్‌లో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని స్పష్టం చేశాక అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ఇదే స్కూల్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి.
The Indian School in Sadiq Nagar received an bomb threat via email. As a precautionary measure, the school has been vacated. Bomb Detection and Disposal Squad informed: Delhi police
More details awaited. pic.twitter.com/p6DKKeSXsl— ANI (@ANI) April 12, 2023
"ఈ స్కూల్‌కి బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి అడ్మిన్‌కు మెయిల్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈ సమాచారం అందిన వెంటనే మేము బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో వచ్చాం"
- చందన్ చౌదర్, పోలీస్ ఉన్నతాధికారి
Pawan Kalyan Varahi: ఈ 14 నుంచే రోడ్లపైకి పవన్ కళ్యాణ్ వారాహి, రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన
Mumbai Airport: ఎయిర్పోర్ట్ సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన మహిళ, బ్యాగ్‌లో బాంబు ఉందంటూ డ్రామా
Telangana Formation Day: తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేస్తే, సోనియా వారి బాధను అర్థం చేసుకున్నారు: మీరా కుమార్
UPI: ఫోన్ తియ్-పే చెయ్, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్
Karnataka Cabinet: కర్ణాటకలో ఇకపై ఉచిత విద్యుత్, అప్పటి నుంచే అమలు - మిగతా హామీలకూ గ్రీన్ సిగ్నల్
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!
Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్