Satyendar Jain Video: జైలు గదిలో విందు భోజనం, ఆప్ లీడర్ మరో వీడియో వైరల్
Satyendar Jain Video: సత్యేంద్ర జైన్ జైలు గదిలో హోటల్ ఫుడ్ తింటున్న వీడియో వైరల్ అవుతోంది.
Satyendar Jain Video:
హోటల్ ఫుడ్..
తీహార్ జైల్లో ఉన్న సత్యేంద్ర జైన్ ఎంత విలాసంగా గడుపుతున్నారో రుజువు చేసే వీడియోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇటీవలే.. ఆయన మసాజ్ చేసుకుంటున్న వీడియో సంచలనం కాగా...ఇప్పుడు మరో వీడియో వెలుగులోకి వచ్చింది. జైలు గదిలో కూర్చుని హోటల్ ఫుడ్ తింటున్నారు సత్యేంద్ర జైన్. తీహార్ జైలు సిబ్బంది ప్రకారం..ఆయన 8 కిలోల బరువు పెరిగారని తెలుస్తోంది. అయితే...సత్యేంద్ర తరపున లాయర్ మాత్రం..ఆయన 28 కిలోలు తగ్గారని చెబుతున్నారు. తనకు సరైన ఆహారం అందించడం లేదని, మెడికల్ చెకప్స్ కూడాచేయించడం లేదని జైన్ ఆరోపిస్తున్న తరుణంలోనే...ఈ వీడియో బయటకు రావడం సంచలనమవుతోంది. అయితే...సత్యేంద్ర జైన్ కౌన్సిలర్, సీనియర్ అడ్వకేట్ రాహుల్ మెహ్రా...ఈడీ అధికారుల తీరుపై మండి పడుతున్నారు. "ఎంతో సున్నితమైన వివరాలను మీడియాకు లీక్ చేస్తున్నారు" అంటూ విమర్శిస్తున్నారు. అధికారుల తీరుతో తన పరువు పోతోందని ఆరోపించారు జైన్. జైన్ తరపున లాయర్ మెహ్రా ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారన్న విషయాన్ని ఖండించారు. "వాళ్లు మాట్లాడే వీఐపీ ట్రీట్‌మెంట్ ఏంటో మాకర్థం కావట్లేదు" అని అన్నారు.
"నేను జైలుకి వచ్చినప్పటి నుంచి 28 కిలోల బరువు తగ్గాను. ఇదేనా నాకు దక్కుతున్న వీఐపీ ట్రీట్‌మెంట్..? సరైన సమయానికి తిండి కూడా పెట్టడం లేదు. ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించనే లేదు" అని తేల్చి చెప్పారు సత్యేంద్ర జైన్.
#WATCH | Latest CCTV footage sourced from Tihar jail sources show Delhi Minister Satyendar Jain getting proper food in the jail.
— ANI (@ANI) November 23, 2022
Tihar Jail sources said that Satyendar Jain has gained 8 kg of weight while being in jail, contrary to his lawyer's claims of him having lost 28 kgs. pic.twitter.com/cGEioHh5NM
మసాజ్ చేయించుకుంటూ..
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఆప్ నేత సత్యేంద్ర జైన్ తీహార్ జైల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సంచలనమైంది. బెడ్‌పై పడుకుని ఉండగా...ఓ వ్యక్తి ఆయన కాళ్ల దగ్గర కూర్చుని మసాజ్ చేస్తూ కనిపించాడు. జైల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని కొన్ని రోజులుగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడీ వీడియోతో అది నిజమైన రుజువైంది. ఇప్పటికే ఈడీ ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ లభిస్తోందని ఆరోపిస్తోంది. ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఆయన జైల్లో చాలా విలాసంగా గడుపుతున్నారని అందులో పేర్కొంది. మసాజ్ కూడా చేయించుకుంటున్నాడని తెలిపింది. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే ఇప్పుడు సీసీటీవీ విజువల్స్ బయటకు వచ్చాయి. సత్యేంద్ర జైన్‌కు అక్కడి సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని...ఫుడ్, వాటర్ బయట నుంచి స్పెషల్‌గా తెప్పిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రత్యేకంగా మినరల్ వాటర్ తెప్పించుకుంటున్నట్టూ చెబుతున్నారు. ఈ వీడియోలో మినరల్ వాటర్ బాటిల్స్ కూడా కనిపించడం వల్ల అది కూడా నిజమని తేలింది. దీనిపై ఇప్పటికే రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీ...ఆప్‌పై డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టింది.
Also Read: Restaurant Bill: 37 ఏళ్ల కిందటి బిల్లు షేర్ చేసిన రెస్టారెంట్, నెటిజన్లు షాక్ - ఎంతో తెలుసా