Most Polluted Cities: టాప్-10 పొల్యూటెడ్ నగరాల్లో మన సిటీలు, లిస్ట్ విడుదల చేసిన రిపోర్ట్
Most Polluted Cities: ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కత్తా ఉన్నాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది.
Most Polluted Cities:
ఢిల్లీ, కోల్‌కత్తాలో తీవ్ర కాలుష్యం..
ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో భారత్‌లోని ఢిల్లీ, కోల్‌కత్తా ఉన్నట్టు అమెరికాకు చెందిన Health Effects Institute (HEI) వెల్లడించింది. ఈ రెండు నగరాల్లోనూ పర్టిక్యులేట్ మ్యాటర్ అధికంగా ఉందని తేల్చి చెప్పింది. ‘Air Pollution and Health in Cities’ పేరుతో నివేదిక విడుదల చేసింది. 2010 నుంచి 2019 మధ్య కాలంలో స్థితిగతుల్ని పరిశీలించి ఈ జాబితాను ప్రచురించింది. వాతావరణంలోని పర్టిక్యులేట్ మ్యాటర్ (PM)తో పాటు, నైట్రోజన్ డయాక్సైడ్ (NO2)ఎంత మోతాదులో ఉంది అనేది లెక్కించి, వాటి ఆధారంగా...ఈ లిస్ట్‌ను తయారు చేశారు. ఈ జాబితాలో ముంబయి 14వ స్థానంలో ఉంది. టాప్ 10లో ఢిల్లీ, కోల్‌కత్తా ఉన్నాయి. భారత్‌లోని 20 నగరాలపై పరిశోధన
చేయగా..అందులో దాదాపు 18 నగరాల్లో పార్టికల్ పొల్యూటెంట్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని తేలింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 7 వేల నగరాల్లో కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. మొత్తం 7,239 నగరాల్లో 2010-2019 వరకూ తీవ్ర కాలుష్యం ఉన్న 20 నగరాల్లో భారత్‌కు చెందినవే 18 సిటీలున్నాయి. ఈ ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని..HEI పరిశోధకులు వెల్లడించారు. భారత్‌తో పాటు ఇండోనేషియాలోనూ కలుషిత నగరాల సంఖ్య ఎక్కువగానే ఉంది. చైనాలో మాత్రం కాలుష్య నియంత్రణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని రిపోర్ట్ వివరించింది. స్వల్ప, మధ్యాదాయ దేశాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటోంది.
ఢిల్లీలో కాలుష్య కట్టడికి కొత్త ప్లాన్..
దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం (Delhi Air Pollution) గురించి ప్రస్తావన వస్తే, దిల్లీ సిటీ పేరు తప్పకుండా వినిపిస్తుంది. అంతర్జాతీయంగా అత్యంత కలుషిత నగరాల జాబితాలో దిల్లీ ఎప్పటి నుంచో ఉంది. ఎన్నో నివేదికలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా..ఇప్పుడిప్పుడే పరిష్కరించేందుకు రకరకాల మార్గాలు వెతుక్కుంటోంది ప్రభుత్వం. రానున్న చలికాలంలో దిల్లీ వాసులకు ఇబ్బందులు తప్పించేందుకు కొత్త ప్లాన్‌తో సిద్ధమవుతోంది. ది కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్-CAQM..గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్- GRAP అమలు చేసేందుకు రెడీ అవుతోంది. కాలుష్యాన్ని కట్టడి చేయడమే కాకుండా, ప్రజలపై తీవ్ర ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ ప్రణాళికలు తోడ్పడతాయని అంటోంది అక్కడి ప్రభుత్వం. 2017లోనే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ..ఈ గ్రేడెడె రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలని సూచించింది. అక్టోబర్ మధ్య నుంచి ఎప్పుడైతే కాలుష్యం ఎక్కువవుతోందో అప్పుడు ఈ ప్లాన్‌ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ GRAPని నాలుగు భాగాలుగా విభజించారు.
వాయు నాణ్యత ఆధారంగా స్టేజ్‌లను నిర్ధరిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201-300 మధ్యలో ఉంటే స్టేజ్ 1గా, 301-400గా ఇంటే స్టేజ్2గా పరిగణిస్తారు. 401-450 వరకూ స్టేజ్-3 కాగా, 450 కి మించి AQI ఉంటే అత్యంత ప్రమాదకమైన స్టేజ్ 4గా నిర్ధరిస్తారు. బొగ్గుతో పాటు, రెస్టారెంట్‌లు,హోటల్‌లో తందూర్స్‌నూ వినియోగించేందుకు వీల్లేకుండా ఆంక్షలు విధిస్తారు. డీజిల్ జనరేటర్ సెట్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. స్టేజ్ 3 వరకూ తీవ్రత చేరుకుంటే, వెంటనే ఎన్‌సీఆర్, దిల్లీ పరిధిలోని నిర్మాణాలను ఆపేస్తారు. అత్యవసర ప్రాజెక్ట్‌లు తప్ప మిగతా అన్ని నిర్మాణాలపైనా ఆంక్షలు అమల్లోకి వస్తాయి.
Also Read: AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్‌లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు