By: Ram Manohar | Updated at : 05 Mar 2023 10:46 AM (IST)
విచారణ పేరుతో సీబీఐ అధికారులు తనను మానసికంగా వేధిస్తున్నారని సిసోడియా ఆరోపించారు.
Manish Sisodia:
కస్టడీ పొడిగింపు
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా CBI అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను మానసికంగా వేధిస్తున్నారంటూ కోర్టుకు వెల్లడించారు. రోజూ ప్రశ్నలు అడిగి బాగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. 5 రోజుల పాటు కస్టడీలో ఉంచిన CBI శనివారం ఆయనను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈ క్రమంలోనే సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు.
"ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచే ప్రశ్నలు అడగడం మొదలు పెడుతున్నారు. అడిగినవే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్‌లు ఏమీ లేవు. దాదాపు 9-10 గంటల పాటు కూర్చోబెడుతున్నారు. ఇది మానసిక వేధింపుల కన్నా తక్కువేమీ కాదు"
-మనీష్ సిసోడియా
ఈ వాదనలు విన్న కోర్టు మార్చి 6 వరకూ CBI కస్టడీని పొడిగించింది. మార్చి 10వ తేదీన మరోసారి విచారణ చేపడతామని వెల్లడించింది. సిసోడియా విచారణకు సరైన విధంగా సహకరించడం లేదని, కస్టడీని మరో మూడు రోజుల పాటు పొడిగించాలని కోర్టుని కోరారు అధికారులు. ఈ మేరకు కోర్టు ఆ నిర్ణయం తీసుకుంది. అయితే...సిసోడియా తరపు న్యాయవాది మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీనిపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. కేవలం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే CBI నడుచుకుంటోందని విమర్శించారు.
"CBI నిజానిజాలతో పని లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తోంది. ఇదంతా కేవలం మనీష్ సిసోడియాను వేధించడానికి మాత్రమే"
- సౌరభ్ భరద్వాజ్, ఢిల్లీ మంత్రి
Excise Case: Court extends Manish Sisodia's CBI remand, issues notice to CBI on bail
— ANI Digital (@ani_digital) March 4, 2023
Read @ANI Story | https://t.co/PsOaND0E3q#ManishSisodia #ExciseCase #delhiexcisepolicy #CBI pic.twitter.com/yijUVpiFGE
CBI has nothing to do with evidence and truth. They are only listening to what the Central government is saying. This whole procedure is meant to trouble Manish Sisodia: Saurabh Bharadwaj, AAP MLA pic.twitter.com/FRFGlqKX4I
— ANI (@ANI) March 4, 2023
అటు సిసోడియా బెయిల్ కోసం పిటిషన్‌లు వేస్తున్నా లాభం లేకుండా పోయింది. . CBI అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టునే ఆశ్రయించాలంటూ సూచించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. హైకోర్టులో ప్రత్యామ్నాయ మార్గాలు దొరికే అవకాశముందని వ్యాఖ్యానించింది. నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పిటిషన్ విచారించడం కుదరదని స్పష్టం చేశారు చీఫ్ జస్టిస్ డీపై చంద్రచూడ్. ఈ మేరకు తాము ఢిల్లీ హైకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆప్ తెలిపింది. అయితే రౌజ్ అవెన్యూ కోర్టు కూడా సిసోడియా పిటిషన్‌ను పట్టించుకోలేదు. పైగా కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రెండు చోట్లా ఆయనకు చుక్కెదురైంది.
నిజామాబాద్ జిల్లాకు గోల్డ్ మెడల్, భద్రాద్రి, హన్మకొండకు వెండి, ఖమ్మంకు కాంస్యం
LPG Cylinder Subsidy: పీఎంయూవై లబ్దిదారులకు గుడ్ న్యూస్, ఎల్పీజీ సిలిండర్ పై సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు
Bhatti Vikramarka Padayatra : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి - భట్టి విక్రమార్క
IGNOU: ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు- అర్హతలివే!
APPSC Group-4 Exam: 'గ్రూప్-4' మెయిన్స్ తేదీ ఖరారు, హాల్‌టికెట్లు ఎప్పటినుంచంటే?
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల