(Source: ECI/ABP News/ABP Majha)
Delhi Education News: బడి ఎగ్గొడుతున్న లక్షలాది మంది విద్యార్థులు, కారణాలు ఇవేనట
Delhi Education News: ఢిల్లీలో లక్షలాది మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు.
Delhi Education News:
ఢిల్లీ స్కూల్స్ వెలవెల..
ఢిల్లీలో స్కూల్స్ విద్యార్థుల్లేక వెలవెలబోతున్నాయి. బెంచీలన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం...దాదాపు 3 లక్షల మంది స్టూడెంట్స్ పాఠశాలలకు రావటం లేదని తేలింది. మొత్తం ఢిల్లీలోని స్కూల్స్‌లో ఉన్న విద్యార్థుల్లో 18% మంది ఇంటి పట్టునే ఉంటున్నారు. ఎవరూ స్కూల్‌కు అటెండ్ అవటం లేదు. 30 రోజుల లెక్కలు చూస్తే...వారాలకు వారాలు ఆబ్సెంట్ అవుతున్నారు విద్యార్థులు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకూ ఇలా గైర్హాజరవుతున్న విద్యార్థుల సంఖ్య 3 లక్షల 48 వేల 344గా తేలింది. Protection of Child Rights సంస్థ కోసం ఢిల్లీ కమిషన్ ఈ వివరాలు సేకరించి వెలువరించింది. స్కూళ్లలో డ్రాపౌట్‌లు తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలుసుకునేందుకు ఈ లెక్కలే కీలక పాత్ర పోషించనున్నాయి. ఢిల్లీ కమిషన్ మరి కొన్ని వివరాలనూ వెల్లడించింది. స్కూల్స్‌కి రాని విద్యార్థుల్లో 11-16 ఏళ్ల వాళ్లే 72% మంది ఉన్నారు. 11-13 ఏళ్ల విద్యార్థుల సంఖ్య లక్షా 35 వేల 558గా వెల్లడైంది. 55% మంది బాలురు, 45% మంది బాలికలు గైర్హాజరవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1న కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. అప్పటి వరకూ కొవిడ్ ఆంక్షల వల్ల విద్యార్థులు పాఠశాలలకు రాలేదు. తరవాత క్రమంగా వాటిని సడలించారు. అయినా...ఇంకా విద్యార్థులు బడి బాట పట్టలేదని ఈ లెక్కలే చెబుతున్నాయి. అంతే కాదు. ప్రభుత్వం "అటెండెన్స్"ను తప్పనిసరి చేసినా...విద్యార్థులు పట్టించుకోవటం లేదు. బడికి రాని లక్షలాది మంది
పిల్లల్లో 73 వేల మందిని Commission for Protection of Child Rights సంప్రదించింది. ఆ తరవాతే...వాళ్లు స్కూళ్లకు ఎందుకు రావటం లేదో కారణాలు తెలిశాయి.
ఇవీ కారణాలు..
25% మంది విద్యార్థుల తల్లిదండ్రులు తాము తమ పిల్లలతో కలిసి సొంత ఊరికి వెళ్లిపోయామని చెప్పారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే. 11% మంది తల్లిదండ్రులకు తమ పిల్లలు బడికి వెళ్లడం లేదన్న సంగతే తెలియదట. 41% మంది తమ పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదని చెప్పారు. వీటితో పాటు మరి కొన్ని కారణాలూ వెలుగులోకి వచ్చాయి. 0.3% మంది విద్యార్థులు "తమ తల్లిదండ్రులు" చనిపోవటం వల్ల స్కూళ్లకు వెళ్లడం లేదు. 0.22% మంది బాల కార్మికులుగా మారిపోయారు. 0.1% మంది బాలికలకు బాల్య వివాహం జరిగిపోయింది. ఇంకొంత మంది విద్యార్థులు లైంగిక వేధింపుల కారణంగా బడికి వెళ్లడం లేదు. 73 వేల మందితో సంప్రదింపులు జరపగా..వారిలో 33 వేల మంది విద్యార్థులు బడికి వచ్చేందుకు ఒప్పుకున్నారు. వీరిలో 84% మంది తల్లిదండ్రులకు తమ పిల్లలు బడికి వెళ్లడం లేదన్న విషయం తెలియదని తేలింది. వారితో అధికారులు మాట్లాడిన తరవాత బడికి తప్పకుండా పంపుతామని తల్లిదండ్రులు చెప్పారు. కొందరు బాల్య వివాహాల కారణంగా..చదువు మానేయాల్సి వచ్చింది. ఈ కారణాలన్నీ తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు.
Also Read: RGV New Movie : జగన్ బయోపిక్ కాదు రియల్ పిక్ - "వ్యూహం" ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ !