RGV New Movie : జగన్ బయోపిక్ కాదు రియల్ పిక్ - "వ్యూహం" ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ !
రాజకీయ కథతో వ్యూహం సినిమాను తీస్తున్నానని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఇది బయోపిక్ కాదు రియల్ పిక్ అన్నారు.
RGV New Movie : సీఎం జగన్‌తో భేటీ తర్వాత జగన్ తాను ఎలాంటి సినిమా తీయనున్నారో వెంటనే ప్రకటించారు. తన కొత్త సినిమాకు "వ్యూహం" అని పేరు పెట్టారు. తాను తీయబోయేది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని ఆర్జీవీ ప్రకటించారు. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు కానీ ,రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని ప్రకటించారు. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి “వ్యూహం” కధ వచ్చిందన్నారు. రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం అని ఆర్జీవీ ప్రకటించారు.
అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన “వ్యూహం” కధ , రాజకీయ కుట్రల విషం తో నిండి వుంటుంది .
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
రాచకురుపు పైన వేసిన కారం తో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే “వ్యూహం” చిత్రం.
సినిమాకు నిర్మాతగా దాసరి కిరణ్ ఉంటారని ఆర్జీవీ ప్రకటించారు. అయితే ఈ రియల్ పిక్ ఒక సినిమా కాదని రెండు సినిమాలని చెబుతున్నారు. వ్యూహం .., తర్వాత శపథం అని రెండు సినిమాలు ఉంటాయన్నారు. ప్రేక్షకులకు షాక్ ఇస్తామన్నారు.
ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుంది .. మొదటి పార్ట్ “వ్యూహం” ,2nd పార్ట్ “శపథం” .. రెండింటిలోనూ రాజకీయఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయి.
— Ram Gopal Varma (@RGVzoomin) October 27, 2022
రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం “ లో తగులుతుంది .
వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యేందుకు తాడేపల్లిలో బుధవారం ఆర్జీవీ వచ్చారు. అయితే ఆయన నేరుగా ప్రధాన ద్వారం గుండా రాకుండా రహస్యంగా వెనుక ద్వారా గుండా వచ్చి.. జగన్‌తో నలభై నిమిషాల పాటు లంచ్ భేటీ నిర్వహించి మళ్లీ అదే ద్వారం గుండా వెళ్లిపోయారు. విజయవాడలో హోటల్, ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడలేదు. జగన్‌తో మీటింగ్ జరిగిన ఒక్క రోజులోనే తాను రాజకీయ చిత్రం చేస్తున్నట్లుగా ప్రకటించారు. దాని పేరు కూడా ప్రకటించడంతో స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయి ఉంటుందని భావిస్తున్నారు. సీఎం జగన్‌తో ఆర్జీవీ భేటీ అయిన వెంటనే.. ఆయన నిర్మాణ సంస్థలో మూడు సినిమాలు రూపుదిద్దుకుంటాయన్న ప్రచారం జరిగింది.
రెండు సినిమాలు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ఇతరులతో తీయిస్తారని.. జగన్ బయోపిక్‌ను మాత్రం ఆయన స్వయంగా దర్శకత్వం చేస్తారని.. జగన్ కు ఎలివేషన్లు ఇచ్చేలా ఈ సినిమ ఉంటుందన్న అభిప్రాయం వినిపించింది. ఇప్పుడు ఆర్జీవీ కూడా అదే పద్దతిలో ట్వీట్ చేశారు. బయోపిక్ కాదు రియల్ పిక్ అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పకనే చెప్పినట్లయింది. ఈ సినిమా వచ్చే ఎన్నికల ముందు రిలీజ్ చేసే అవకాశం ఉంది. స్వయంగా వైఎస్ఆర్‌సీపీ అధినేత , సీఎం జగన్ ఆసక్తితో నిర్మిస్తున్నారు కాబట్టి బడ్జెట్ సమస్య రాదని.. ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఆర్జీవీ ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కొండా దంపతుల జీవిత కథ కొండాను తెరకెక్కించారు. ఆ సినిమా కనీస ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ధియేటర్లలో విడుదల చేసుకోలేకపోయారు. విడుదలైందో లేదో కూడా ఎవరికీ తెలియదు. కానీ ప్రమోషన్లు మాత్రం చేశారు. ఆర్జీవీ టోటల్‌గా తన సినిమాలను పోర్న్ లెవన్ కంటెంట్ వైపు మార్చేసిన తర్వాత ఆయన తీసే సీరియస్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయింది. అయినప్పటికీ సీఎం జగన్ ఆర్జీవీపై నమ్మకంతో కీలక బాధ్యతలిచ్చారు