అన్వేషించండి

Arvind Kejriwal: నేను చనిపోతే దయచేసి ఎవరూ బాధ పడొద్దు, కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

Arvind Kejriwal: దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సి వస్తే ఎవరూ బాధ పడొద్దని అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arvind Kejriwal Message For Supporters: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ బెయిల్ గడువు ముగిసిపోతున్న క్రమంలో కీలక ప్రకటన చేశారు. ఆదివారం (జూన్ 2) మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుంచి బయల్దేరి ఈడీ ఎదుట లొంగిపోతానని వెల్లడించారు. జూన్ 1వ తేదీతో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగిసిపోతుంది. జూన్ 2వ తేదీన ఈడీ ఎదుట లొంగిపోవాలని కోర్టు కండీషన్ పెట్టింది. ఈ మేరకు తాను సరెండర్ అవుతానని కేజ్రీవాల్ తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు. ఒకవేళ దేశం కోసం తాను చనిపోతే...ఎవరూ బాధపడొద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. 50 రోజుల పాటు జైల్‌లో ఉండడం వల్ల తన ఆరోగ్యం చాలా వరకూ క్షీణించిందని, బరువు తగ్గిపోయానని వెల్లడించారు. డయాబెటిస్‌కి మెడికేషన్‌ తీసుకోడానికి కూడా తనకు అనుమతి ఇవ్వలేదని మండి పడ్డారు. 

"జైల్‌లో దాదాపు 50 రోజుల పాటు ఉన్నాను. ఆ 50 రోజుల్లోనే నేను 6 కిలోల బరువు తగ్గాను. విడుదలైన తరవాత కూడా నేను బరువు పెరగలేదు. వైద్యులు నా ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఢిల్లీ ప్రజల సంక్షేమాన్ని మర్చిపోను. ఉచిత విద్యుత్, వైద్యం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం లాంటి హామీలు నెరవేర్చకుండా ఉండను. మీతో నేను లేకపోయినా సరే అన్ని పనులూ జరుగుతాయి"

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి 

తన తల్లిదండ్రుల ఆరోగ్యం గురించీ ప్రజలు ప్రార్థించాలని అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. బీజేపీ తనను అణిచివేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. నోరు మూయించేందుకూ కుట్ర చేశారని, కానీ వాళ్ల వల్ల కాలేదని అన్నారు. బీజేపీకి ఏం కావాలో అర్థం కావడం లేదని, ఇదంతా ఎందుకు చేస్తున్నారోనని ప్రశ్నించారు. బీజేపీ పేరు ప్రస్తావించకుండానే చురకలు అంటించారు.  ఈ ఏడాది మార్చి 21 వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ తేల్చి చెప్పింది. ఛార్జ్‌షీట్‌లోనూ ఇదే స్పష్టం చేసింది. దీనిపై కేజ్రీవాల్ న్యాయ పోరాటం చేస్తున్నారు. తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఆప్‌ని టార్గెట్ చేసి ఇలా ఇబ్బంది పెడుతున్నారని, ప్రజలంతా గమనించాలని కోరారు. 

Also Read: నీటి వాటా కోసం ఢిల్లీ న్యాయపోరాటం, సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఆప్ సర్కార్

టాప్ హెడ్ లైన్స్

Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. గ్రీన్ చానల్ ద్వారా హైదరాబాద్‌కు తరలింపు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. గ్రీన్ చానల్ ద్వారా హైదరాబాద్‌కు తరలింపు
Kishan Viral Video: ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
Breaking News: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత, హైదరాబాద్‌కు తరలింపు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత, హైదరాబాద్‌కు తరలింపు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget