Dalai Lama Apologies: సారీ చెప్పిన దలైలామా, బాలుడికి ముద్దు పెట్టిన వీడియోపై వివరణ
Dalai Lama Apologies: బాలుడికి ముద్దు పెట్టిన వీడియోపై దలైలామా సారీ చెప్పారు.
Dalai Lama Apologies:
బాలుడికి లిప్‌కిస్
ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక వేత్త దలైలామా వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ బాలుడిని అడిగి మరీ ముద్దు పెట్టించుకున్నారు. ఆ తరవాత కాస్త అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ..ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇదేం పాడు పని అంటూ చాలా మంది ఈ వీడియోని షేర్ చేస్తూ దలైలామాపై మండి పడ్డారు. ఇది కూడా లైంగిక వేధింపుల కిందకే వస్తుందంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దాదాపు 2 నిముషాల ఈ వీడియో వైరల్ అవుతోంది. ముందు ఆ బాలుడి పెదాలపై ముద్దు పెట్టుకున్నారు దలైలామా. ఇది చూసి హాల్‌లో ఉన్న వాళ్లంతా గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. ఆ తరవాత ఆ బాలుడిని దగ్గరకు తీసుకున్నారు. నుదురుని బాలుడి తలకు ఆనించారు. ఆ వెంటనే ఓ అభ్యంతరకరమైన పని చేశారు. అక్కడున్న వాళ్లందరూ ఇంకా గట్టిగా నవ్వారు. "పిల్లాడిని అలా చేస్తుంటే నవ్వడమేంటి..?అక్కడ ఏం జరుగుతోంది..?" అంటూ ఫైర్ అయ్యారు నెటిజన్లు. ఈ క్రమంలోనే దలైలామా స్పందించారు. ఇలా జరిగినందుకు క్షమాపణలు చెప్పారు. బాలుడి కుటుంబానికీ సారీ చెప్పారు. ట్విటర్ వేదికగా ఓ నోట్ విడుదల చేశారు.
"ఈ మధ్య జరిగిన ఓ మీటింగ్‌కు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ బాలుడి కుటుంబానికి, సన్నిహితులకు దలైలామా క్షమాపణలు చెప్పారు. సాధారణంగా తనను కలిసే వారితో ఆయన ఇలా ఇన్నోసెంట్‌గా ప్రవర్తిస్తారు. పబ్లిక్‌లో ఉన్నా, కెమెరాల ముందైనా ఇలా ఆటపట్టిస్తారు. ఏదేమైనా ఇలా జరిగినందుకు ఆయన చింతిస్తున్నారు"
- దలైలామా ట్విటర్ నోట్
A video clip has been circulating that shows a recent meeting when a young boy asked His Holiness the Dalai Lama if he could give him a hug. His Holiness wishes to apologise to the boy and his family, as well as his many friends across the world, for the hurt his words may have… pic.twitter.com/R2RNjhB5b3
— ANI (@ANI) April 10, 2023
— Dalai Lama (@DalaiLama) April 10, 2023
అయితే..దలైలామా తరపున క్షమాపణలు వచ్చినప్పటికీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. కేవలం సారీ చెబితే సరిపోదని మండి పడుతున్నారు. ఆ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొంత మంది మాత్రం సారీ చెప్పినందుకు కాస్త శాంతించారు. మొత్తానికి దిగొచ్చారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
దలైలామా చైనాకు గట్టి షాకే ఇచ్చారు. బుద్ధిజంలో మూడో అత్యున్నత పదవికి మంగోలియాకు చెందిన ఓ 8 ఏళ్ల బాలుడిని నియమించారు. అమెరికాలో పుట్టి పెరిగిన మంగోలియా బాలుడికి ఈ పదవి కట్టబెట్టడం సంచలనంగా మారింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు దలైలామా. 600 మంది మంగోలియన్ల సమక్షంలో ఈ విషయం వెల్లడించారు. ఖల్కా జెస్టన్ దంపా...ఈ బాలుడి రూపంలో మళ్లీ జన్మించారని అన్నారు. పదో ఖల్కా జెస్టన్ దంపాగా బాలుడిని నియమిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం దలైలామా వయసు 87 ఏళ్లు. తదుపరి దలైలామా ఎవరు అన్న చర్చ ఎంతో కాలంగా కొనసాగుతోంది. దీనిపై మాత్రం ఆయన ఎలాంటి స్పష్టతనివ్వడం లేదు.