Top Headlines Today: పెన్షనర్లకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ, కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ కన్నుమూత - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh Telangana Latest News on 29 June 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేస్తే 5 ప్రధాన వార్తలు ఒకేచోట మీకోసం.
Telangana News Today | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్ ఈ ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉదయం మూడు గంటలకు తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా వయసు సంబంధిత అనారోగ్యంతో ధర్మపురి శ్రీనివాస్ బాధపడుతున్నారు. ఈ ఉదయం సడెన్‌గా గుండెపోటు వచ్చి చనిపోయారు. నిజామాబాద్‌లో 27 సెప్టెంబర్ 1948న జన్మించిన డీ శ్రీనివాస్... డీఎస్ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. సామాన్య కార్యకర్తగా మొదలైన ఆయన రాజకీయ ప్రస్తానం ఎంపీ స్థాయి వరకు వెళ్లారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'మండుటెండలో మీ కష్టాలు చూసి చలించా' - పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ
ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ఈ మేరకు పింఛన్ దారులకు శనివారం బహిరంగ లేఖ రాశారు. ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు. 'ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే పింఛన్ ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాం. దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. జులై 1 నుంచి ఇంటి వద్దే పెన్షన్ అందిస్తాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
స్పీకర్ అనుకుంటే జగన్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా - కానీ టీడీపీకి అంత ఔదార్యం ఉందా ?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మాజీ సీఎంజగన్‌కు ప్రతిపక్ష నేత హోదా వస్తుందా లేదా.. అర్హత ఉందా లేదా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. నిజానికి దీనిపై ఎన్నికల ఫలితాల రోజే స్పష్టత వచ్చింది. వైసీపీకి పదకొండు సీట్లు మాత్రమే రావడంతో ప్రధాన ప్రతిపక్ష నేత అర్హత కూడా సాధించలేకపోయిందని రాజకీయ పండితులు తేల్చారు. పది శాతం సీట్లు సాధిస్తేనే.. ప్రతిపక్ష నేత హోదా వస్తుందని ఇప్పటి వరకూ అనేక సార్లు రుజువు అయింది. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి రెండు సార్లుగా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోవడం .. సుప్రీంకోర్టుకు వెళ్లినా సానుకూల ఫలితం రాకపోవడంతో అంత కంటే లోతుగా అకడమిక్ చర్చకు వెళ్లలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం
ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ (59) శనివారం కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబసభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్ తరలించాలని భావించారు. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad) తరలిస్తుండగా మార్గమధ్యలో ఇచ్చోడ వద్ద తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కొండగట్టులో పవన్ కల్యాణ్ ఏం చేస్తారు? ఎంతటైం అక్కడ ఉంటారు?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో కొండగట్టు చేరుకోనున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్‌లోని ఇంటి నుంచి కొండగట్టుకు రోడ్డు మార్గంలో బయల్దేరి వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్‌కు కొండగట్టు అంటే ప్రత్యేక భక్తి భావం ఉంది. 2008లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అక్కడ ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. 2024 ఎన్నికల ముందు చేపట్టిన వారాహి యాత్ర కూడా అక్కడి నుంచే మొదలు పెట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి