News
News
వీడియోలు ఆటలు
X

Covid-19 Cases: భారీగా నమోదవుతున్న కరోనా కేసులు, 3 వేల మంది వైరస్‌- ఆరుగురు మృతి

Covid-19 Cases: దేశంలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని వారాలుగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Covid-19 Cases: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని వారాలుగా విపరీతంగా కేసులు వెలుగుచూస్తున్నాయి. కేసుల్లో ఉద్ధృతి తీవ్రంగా ఆందోళన కలిపిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న వేలాది కేసులతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారత్ లో నిన్న ఒక్కరోజే 3 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారి బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 15 వేలు దాటాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 3,095 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత క్రియాశీల కేసుల సంఖ్య 15,208 గా ఉంది. 24 గంటల్లో 1,396 మంది కరోనాను జయించి  ఆస్పత్రి నుండి డిశ్చార్జీ అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. కరోనా రికవరీ రేటు 98.78 శాతం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. 

గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో విపరీతమైన పెరుగుదల నమోదు అవుతోంది. మార్చి 30వ తేదీన నమోదు అయిన కేసులతో పోలిస్తే మార్చి 31న వెలుగు చూసిన కేసుల్లో 50 శాతం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో కొత్తగా 694 కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 765 కేసులు వెలుగు చూశాయి. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ వారంలో సోమవారంతో పోలిస్తే మంగళవారం దేశవ్యాప్త కేసుల్లో కొంత తగ్గుదల కనిపించింది. తిరిగి బుధవారం కేసులు పెరిగాయి. గురు, శుక్రవారాల్లోనూ విపరీతమైన పెరుగుదల ప్రస్తుతం అధికారులను ఆందోళనకు  గురి చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రధానమంత్రి నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16 ఉద్ధృతి వల్లే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెరిగితే కేసులు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

గర్భధారణ సమయంలో కోవిడ్ వస్తే పుట్టే పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం 

ఎండోక్రైన్ సొసైటీకి చెందిన జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజీ & మెటబాలిజంలో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, గర్భధారణ సమయంలో కోవిడ్-19 వచ్చే తల్లులకు జన్మించిన పిల్లలు ఊబకాయం వచ్చే అవకాశం ఉంది.

2019 నుంచి యునైటెడ్ స్టేట్స్‌లో 100 మిలియన్లకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్‌ఫెక్షన్ వల్ల దీర్ఘకాలికందా ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయన్న సమాచారం ఉంది. "మా పరిశోధనలు కోవిడ్-19కి గురైన గర్భిణీలకు పుట్టిన పిల్లల జీవితంపై ప్రభావం చూపించనుంది. ఇది స్థూలకాయం, షుగర్‌,  హృదయ సంబంధ వ్యాధులకు కారణం కావచ్చు " అని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ ఎండీ లిండ్సే టీ ఫోర్మాన్ అన్నారు. "గర్భిణీ స్త్రీలు. వారి పిల్లలపై COVID-19 ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా పరిశోధనలు అవసరం." గర్భధారణ సమయంలో COVID-19 ఉన్న తల్లులకు జన్మించిన 150 మంది శిశువులను పరిశోధకులు అధ్యయనం చేశారు. తల్లులకు ప్రినేటల్ ఇన్‌ఫెక్షన్ లేని 130 మంది శిశువులతో పోలిస్తే వారు తక్కువ బరువు కలిగి ఉన్నారని కనుగొన్నారు. ఈ మార్పులు ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. 

Published at : 31 Mar 2023 11:51 AM (IST) Tags: Corona India News COVID In India Corona Cases COVID 19

సంబంధిత కథనాలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

మోదీ చరిష్మా ప్రతి సారి పని చేయదు, గెలవడానికి అది మాత్రమే చాలదు - బీజేపీపై RSS కీలక వ్యాఖ్యలు

మోదీ చరిష్మా ప్రతి సారి పని చేయదు, గెలవడానికి అది మాత్రమే చాలదు - బీజేపీపై RSS కీలక వ్యాఖ్యలు

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

UGC-NET: జూన్‌ 13 నుంచి యూజీసీ నెట్‌ పరీక్షలు, పూర్తి షెడ్యూలు ఇలా!

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

టాప్ స్టోరీస్

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

IND VS AUS: మొదటి సెషన్ మనదే - నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు - ఇక నుంచి కీలకం!

IND VS AUS: మొదటి సెషన్ మనదే - నాలుగు వికెట్లు తీసిన బౌలర్లు - ఇక నుంచి కీలకం!

YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !

YSRCP News :  రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !