By: ABP Desam | Updated at : 27 Mar 2023 02:22 PM (IST)
Edited By: jyothi
ఖగోళంలో అద్భుతం, ఒకే వరుసలో ఐదు గ్రహాలు
Cosmic Spectacle: ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. మార్చి 28న తేదీన ఈ అద్భుత దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించవచ్చు. మార్చి 28 మంగళవారం రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ఈ అద్భుతమైన దృశ్యం కనిపించనుంది. చంద్రుడితోపాటు గురు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, యురేనస్ గ్రహాలు ఒకే కక్ష్యలో కనిపించనున్నాయి. ఈ గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఒకానొక సమయంలో ఒకే అక్షర సరళ రేఖలో ఉండకపోయినా ఆర్క్ లాగా దృశ్యం ఆవిష్కృతం కానుంది. సూర్యాస్తమయం తర్వాత పడమర వైపు ఈ దృశ్యం కనిపించనుంది. 50 డిగ్రీల పరిధిలో ఈ ఐదు గ్రహాలు కనిపిస్తాయి. ఇందులో గురు, శుక్ర, అంగారక గ్రహాలను నేరుగా కళ్లతో చూడవచ్చు. బుధగ్రహం, యురేనస్ ను మాత్రం బైనాక్యులర్ ఉపయోగించి చూడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
Don’t forget to look to the sky the end of the month for the planetary alignment which will have at least five planets – plus the moon – all visible in almost an arc shape as seen from Earth. https://t.co/9OINapk8fe
— Dr. Buzz Aldrin (@TheRealBuzz) March 16, 2023
ప్రకాశవంతంగా కనిపించనున్న శుక్రుడు
గురు గ్రహం బుధగ్రహం కంటే ప్రకాశవంతంగా కనిపించనుంది. మొత్తం సమూహంలో శుక్ర గ్రహం అత్యంత ప్రకాశవంతంగా కనిపించనుంది. బుధ గ్రహానికి ఎడమ వైపున గురు, శుక్ర గ్రహాలు ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. మిగతా గ్రహాలతో పోలిస్తే శుక్ర గ్రహం ప్రకాశవంతంగా కనిపించనున్న దృష్ట్యా.. శుక్ర గ్రహాన్ని నేరుగా కంటితో చూడొవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే బైనాక్యులర్ లాంటి వాటితో యురేనస్ గ్రహాన్ని చూడవచ్చు. శుక్ర గ్రహం సమీపంలో యురేనస్ కనిపించనుంది కానీ ప్రకాశవంతంగా ఉండకపోవడం వల్ల స్పష్టంగా కనిపించదు. అంగారక గ్రహం కూడా చాలా స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మార్చి 1 గురు, శుక్ర గ్రహాల కలయిక
ఫిబ్రవరి నెల అంతటా గురు, శుక్ర గ్రహాలు చంద్రునితో పాటు కనిపించాయి. ఈ మూడు గ్రహాలు ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చినట్లు దృశ్యం ఆవిష్కృతమైంది. గ్రహాల మధ్య సంయోగం సౌర వ్యవస్థలో అప్పుడప్పుడు జరుగుతుంది. గ్రహాలు సూర్యుని చుట్టూ వివిధ కక్ష్యల్లో తిరుగుతుంటాయి. ఒకానొక సమయంలో ఒకదానితో ఒకటి సరళరేఖను ఏర్పరుస్తాయి. భూమిపై నుండి చూసినప్పుడు ఈ దృశ్యంలో ఆయా గ్రహాలు అతి దగ్గరగా వచ్చినట్లుగా కనిపిస్తుంది. కానీ వాటి మధ్య దూరం ఎప్పట్లాగే కొన్ని కాంతి సంవత్సరాల దూరం ఉంటుంది. స్కై టునైట్, స్కై సఫారి వంటి ఖగోళ శాస్త్ర యాప్ ల ద్వారా ఈ దృశ్యాన్ని వీక్షించవచ్చు. ఈ యాప్ లు ఆకాశంలో ఏయే గ్రహం ఎక్కడ ఉందో కచ్చితంగా చెబుతాయి.
ఈ ఖగోళ అద్భుతాన్ని ఎక్కడి నుండి చూడొచ్చంటే?
స్పష్టమైన ఆకాశం, చెట్లు, భవనాలు ఏవీ అడ్డుగా లేకపోతే ఈ ఖగోళ అద్భుతాన్ని ఎక్కడి నుండి అయినా చూడొచ్చు. గురు గ్రహాన్ని, అంగారక గ్రహాన్ని మంచి ప్రదేశం నుండి మాత్రమే చూసే వీలుంది. శుక్ర గ్రహం ప్రకాశవంతంగా ఉంటుంది కాబట్టి దీనిని చూడటం చాలా సులభం. యురెనస్ సరైన పరికరాలు లేకుండా చూడటం కష్టం. ఆరెంజ్ హ్యూ ఉన్నప్పుడు నైరుతి దిక్కు నుండి అంగారక గ్రహాన్ని వీక్షించవచ్చు.
CBI Probe Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Odisha Train Accident: కవచ్ ఉన్నా లాభం లేకపోయేది, కొన్ని ప్రమాదాల్ని ఏ టెక్నాలజీ అడ్డుకోలేదు - రైల్వే బోర్డ్
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు