Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 13 వేల మందికి వైరస్
Corona Cases: దేశంలో కొత్తగా 13,734 కరోనా కేసులు నమోదయ్యాయి. 34 మంది మృతి చెందారు
Corona Cases: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 13,734 కరోనా కేసులు నమోదయ్యాయి. 34 మంది మృతి చెందారు. కొవిడ్ నుంచి తాజాగా 17,897 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది.
13,734 new COVID19 cases in India today; Active cases at 1,39,792 pic.twitter.com/NVRO566sqO
— ANI (@ANI) August 2, 2022
- మొత్తం కేసులు : 4,40,50,009
- మొత్తం మరణాలు: 5,26,430
- యాక్టివ్ కేసులు: 1,39,792
- మొత్తం రికవరీలు: 4,33,83,787
వ్యాక్సినేషన్
దేశంలో తాజాగా 26,77,405 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 204.60 కోట్లు దాటింది. మరో 4,11,102 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని కేంద్రం.. రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్‌లో మరో కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.
Also Read: Monkeypox Case India : దిల్లీలో మరో మంకీపాక్స్ కేసు, నైజీరియన్ కు పాజిటివ్
Also Read: Electric Vehicles: వర్షాల్లోనూ ఈవీలు నడపొచ్చు, బ్యాటరీతో ఏ సమస్యా ఉండదంటున్న నిపుణులు