అన్వేషించండి

Congress: కర్ణాటక కథ ముగిసింది, తరవాతి టార్గెట్ ఫిక్స్ చేసుకున్న కాంగ్రెస్ - ఆ 4 రాష్ట్రాలపైనే ఫోకస్

Congress: రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టింది కాంగ్రెస్.

Congress Eyes on Elections: 

నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు..

ఈ మధ్యే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల్లో ఒక్క గుజరాత్‌లో తప్ప మిగతా రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కూడా పూర్తైంది. ఇక ఇప్పుడు అసలు సవాళ్లు ఎదుర్కోనుంది ఆ పార్టీ. అందులోనూ 2024లో లోక్‌సభ ఎన్నికల్లో ఉనికి చాటుకోవడం చాలా ముఖ్యం. ఇక అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే...తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకుంది కాంగ్రెస్. హిమాచల్, కర్ణాటక ఇచ్చిన జోష్‌తోనే ఈ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంది. మే 24వ తేదీన కాంగ్రెస్ హైకమాండ్‌ కీలక భేటీకి పిలుపునిచ్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేయనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. పదవుల కోసం పోరాటాల వల్ల దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌ల్ అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయి. కర్ణాటకలోనూ ఇదే తప్పదని బీజేపీ నేతలు గట్టిగానే విమర్శించారు. కానీ...హైకమాండ్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించింది. సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా పవర్ షేరింగ్ చేసింది. వాళ్లను బుజ్జగించింది. కర్ణాటకలో యుద్ధం ముగిసినా...రాజస్థాన్‌లో మాత్రం ఇంకా అవే సమస్యలు కొనసాగుతున్నాయి. సచిన్ పైలట్, గహ్లోట్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. 

స్ట్రాటెజీ ఏంటి..? 

సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేశారు సచిన్ పైలట్. సీఎం కుర్చీ కోసం చాలా ఆరాట పడుతున్నారు. అటు గహ్లోట్ మాత్రం సీఎం కుర్చీ నుంచి దిగేదే లేదని తేల్చి చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరతకూ కారణమయ్యారు సచిన్ పైలట్. బీజేపీ నేతలతో కుమ్మక్కై కుట్ర చేశారని అశోక్ గహ్లోట్ చాలా సందర్భాల్లో విమర్శించారు. అప్పటి నుంచి పైలట్‌, గహ్లోట్‌కి మధ్య వైరం దూరం పెరుగుతూ వచ్చాయి. పవర్ షేరింగ్ ఫార్ములా కర్ణాటకలో వర్కౌట్ అయినా...రాజస్థాన్‌లో వర్కౌట్ అవుతుందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే...అక్కడ కాంగ్రెస్‌కి జరిగిన అతి పెద్ద నష్టం..జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటం. ఆయనతో పాటు 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఫలితంగా..2020లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. రెబల్స్ అంతా బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. అయితే...ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. దీన్నే తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టిగా కసరత్తు చేస్తోంది. తెలంగాణలో కేసీఆర్ సర్కార్‌పై దాడి మొదలు పెట్టింది. తెలంగాణలోనూ కచ్చితంగా అధికారంలోకి వస్తామని కొందరు స్థానిక నేతలు చెబుతున్నా...అంత క్యాడర్ ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే...భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్‌కి బూస్టప్ వచ్చిందని హైకమాండ్  భావిస్తోంది. అందుకే...కర్ణాటక గెలుపుకి క్రెడిట్ అంతా రాహుల్‌కే ఇచ్చేశారు సీనియర్ నేతలు. ఇదో జోష్‌తో బరిలోకి దిగితే రానున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉంది. 

Also Read: Kerala Story Controversy: థియేటర్‌ ఓనర్లను బెదిరిస్తున్నారు, కేరళ స్టోరీ వివాదంపై అమిత్ మాల్వియా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Embed widget