By: Ram Manohar | Updated at : 21 May 2023 12:45 PM (IST)
కోల్‌కత్తాలో అధికారులు థియేటర్ ఓనర్లను బెదిరిస్తున్నారని అమిత్ మాల్వియా ఆరోపించారు.
Kerala Story Controversy:
పశ్చిమ బెంగాల్‌లో బ్యాన్
The Kerala Story సినిమాపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమూ ఆగడం లేదు. కొన్ని బీజేపీ రాష్ట్రాల్లో దీనిపై ట్యాక్స్ ఎత్తివేయగా...బీజేపీయేతర రాష్ట్రాలు మాత్రం ఈ సినిమా ప్రదర్శనపై ఆంక్షలు విధిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ఏకంగా ఈ సినిమాపై బ్యాన్ విధించింది. తమిళనాడులోనూ కొన్ని థియేటర్ యాజమాన్యాలు ఈ సినిమాని ప్రదర్శించడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సినిమాని నిషేధించడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నోటీసులు కూడా ఇచ్చింది. ఈ విషయం ప్రస్తావిస్తూ మాల్వియా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. థియేటర్లు సినిమాను ప్రదర్శించాలని చూస్తున్నా..కొందరు లోకల్ లీడర్స్ వాళ్లను బెదిరిస్తున్నారని తేల్చి చెప్పారు. ఆ సినిమాపై కావాలనే కక్ష కడుతున్నారని మండి పడ్డారు. "సినిమా ప్రదర్శిస్తే శిక్ష తప్పదు" అని కొందరు నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు.
"పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ది కేరళ స్టోరీపై బ్యాన్ విధించింది. దీనిపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆ బ్యాన్ ఎత్తివేసింది. అయినా కోల్‌కత్తాలో ఒక్క థియేటర్‌లో కూడా సినిమాని ప్రదర్శించడం లేదు. ప్రభుత్వం బ్యాన్ చేయకముంది అన్ని హాల్‌లూ నిండిపోయాయి. ఇప్పుడు మాత్రం ఖాళీగా కనిపిస్తున్నాయి. సినిమాని ప్రదర్శిస్తే శిక్ష తప్పదని అధికారులు థియేటర్ యాజమాన్యాలను హెచ్చరిస్తున్నారు. లైసెన్స్‌లు తీసేస్తామని బెదిరిస్తున్నారు. ఇది కోర్టు ఉల్లంఘన కాదా..? సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ జరపాలి. సుప్రీంకోర్టు ఆదేశాలనే పట్టించుకోడం లేదంటే అక్కడ ఎలాంటి పాలన కొనసాగుతుందో అర్థమవుతోంది"
- అమిత్ మాల్వియా, బీజేపీ ఐటీ డిపార్ట్‌మెంట్ చీఫ్
After the Supreme Court lifted ban on The Kerala Story in West Bengal, not one theater in Kolkata is screening the movie, when they were all running houseful before Mamata Banerjee clamped down. Cinema hall owners are being threatened by the local administration with punitive…
— Amit Malviya (@amitmalviya) May 20, 2023
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. The Kerala Storyపై ఆ ప్రభుత్వం బ్యాన్ విధించడాన్ని తప్పుబట్టింది. ఆ ఆదేశాలపై స్టే విధించింది. ప్రజల అసహనానికి అనుగుణంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేమని తేల్చి చెప్పింది. కేరళ హైకోర్టులోనే దీనిపై పిటిషన్ దాఖలైంది. కానీ...ఆ కోర్టు స్టే విధించేందుకు అంగీకరించలేదు. అక్కడి నుంచి పిటిషనర్లు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం...నిషేధం విధించడానికి వీల్లేదని వెల్లడించింది. జర్నలిస్ట్ కుర్బాన్ అలీ ఈ పిటిషన్ వేశారు. అయితే..దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని కపిల్ సిబాల్ కోర్టుకి విన్నవించారు. అప్పటికే హైకోర్టులో కొందరు జడ్జ్‌లు కేరళ స్టోరీ టీజర్‌ని చూశారు. ఆ తరవాతే స్టే విధించేందుకు అంగీకరించలేదు.
Also Read: ముస్లింతో బీజేపీ నేత కూతురి పెళ్లి, లవ్ జీహాద్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు
Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్ న్యూస్
Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ
ABP Desam Top 10, 1 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
IBPS RRB XII Recruitment 2023: గ్రామీణ బ్యాంకుల్లో 8463 ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!
Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు