News
News
X

China President Xi Jinping: జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్ ఉత్తిదే- బీజింగ్‌లో ప్రత్యక్షమైన చైనా అధ్యక్షుడు!

China President Xi Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను హౌస్ అరెస్ట్ చేశారంటూ ఇటీవల వచ్చిన వార్తలు అవాస్తవమని తెలుస్తోంది. బీజింగ్‌లో జరిగిన ఓ ప్రదర్శనలో జిన్‌పింగ్ కనిపించారు.

FOLLOW US: 
 
China President Xi Jinping: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గృహ నిర్బంధంలో ఉన్నారంటూ ఇటీవల సంచలన వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమని తేలిపోయింది. దశాబ్ద కాలంలో చైనా కమ్యూనిస్టు పార్టీ, దేశం సాధించిన ఘనతలపై బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ఓ ప్రదర్శనలో జిన్‌పింగ్ పాల్గొన్నారు. ఈ మేరకు చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.

ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు వెళ్లి ఈ నెల 16న తిరిగి చైనా వచ్చారు జిన్‌పింగ్‌. అయితే ఆ తర్వాత ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే తొలిసారి. ఆయన కనిపించకపోయేసరికి సోషల్ మీడియాలో వివిధ వార్తలు వచ్చాయి.

హౌస్ అరెస్ట్!

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్లు సోషల్ మీడియా సహా ప్రధాన మీడియా ఛానళ్లలో ఇటీవల వార్తలు రావడం సంచలనంగా మారింది. అంతేకాకుండా జిన్‌పింగ్‌ను కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా, చైనా ఆర్మీ చీఫ్‌గా తొలగించారనే వార్తలు వైరల్‌గా మారాయి. దేశం మొత్తాన్ని చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) తన చేతుల్లోకి తీసుకున్నట్లు వార్తల్లో పేర్కొన్నారు. అంతేకాదు చైనా కొత్త అధ్యక్షుడిగా లీ కియామింగ్‌ను ఆర్మీ ఎంపిక చేసిందని వార్తలు రావడంతో వెంటనే ఈ న్యూస్ వైరల్‌ అయింది. 

News Reels

వార్తల సంగతి పక్కనపెడితే కొందరు చైనీయులు కూడా ఇలాంటి పోస్టులే చేశారు. జిన్‌పింగ్‌ను ఆర్మీ.. అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిందని, ఆయన స్థానంలో లీ కియామింగ్‌ను కొత్త అధ్యక్షుడిగా నియమించిందని పేర్కొన్నారు.

ఇలా ట్వీట్లు

చైనా ఆర్మీ వాహనాలు సెప్టెంబర్ 22న బీజింగ్ చేరుకున్నాయని, హువాన్‌లై కౌంటీ నుంచి హిబే ప్రావిన్సు ఝాంగ్‍జియాకో సిటీ వరకు 80 కీలోమీటర్ల మేర ర్యాలీగా వెళ్లాయని ఓ చైనా మహిళ వీడియోను షేర్ చేసింది.

ఇదీ విషయం

అయితే చైనాలో జీరో కొవిడ్‌ విధానాన్ని పాటిస్తున్నారు. దీంతో విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన జిన్‌పింగ్‌ విధిగా ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉండి ఉంటారని, అందుకే బహిరంగ ప్రదేశాలకు రాలేదని సమాచారం. కానీ ఈ లోపే జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచారని వదంతులు వ్యాపించాయి.

Also Read: Rajasthan Congress Crisis: గహ్లోత్‌కు షాకిచ్చి దారిలోకి తెచ్చుకున్న అధిష్ఠానం- అధ్యక్ష రేసులో ఆయనే!

Also Read: Lakhimpur Road Accident: యూపీలో ఘోర ప్రమాదం, ప్రైవేట్ బస్, ట్రక్ ఢీ - 8 మంది మృతి

Published at : 28 Sep 2022 11:41 AM (IST) Tags: SCO summit China President Xi Jinping Jinping Appears In Public House Arrest Rumors

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

Gold-Silver Price 2 December 2022: 54 వేలు దాటేసిన పసిడి- తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్‌!

Gold-Silver Price 2 December 2022: 54 వేలు దాటేసిన పసిడి- తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్‌!

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?

తెలంగాణ ఎడ్‌సెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి!

తెలంగాణ ఎడ్‌సెట్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి!

UAE Jobs: యూఏఈలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలివే, జీతమెంతో తెలిస్తే షాకవుతారు!

UAE Jobs: యూఏఈలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలివే, జీతమెంతో తెలిస్తే షాకవుతారు!

టాప్ స్టోరీస్

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

TSPSC Group 4 Notification: తెలంగాణలో 'గ్రూప్-4' నోటిఫికేషన్ విడుదల, 9168 ఉద్యోగాల భర్తీ! దరఖాస్తు ఎప్పుడంటే?

TSPSC Group 4 Notification: తెలంగాణలో 'గ్రూప్-4' నోటిఫికేషన్ విడుదల, 9168 ఉద్యోగాల భర్తీ! దరఖాస్తు ఎప్పుడంటే?

FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం - టోర్నీ నుంచి బెల్జియం అవుట్!

FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం - టోర్నీ నుంచి బెల్జియం అవుట్!

Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!

Bluebugging: ఈ కొత్త హ్యాకింగ్ గురించి చూస్తే మీ ఫోన్‌లో బ్లూటూత్ అస్సలు ఆన్ చేయరు!