యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
జనరేషన్ గట్టర్ వ్యాఖ్యలపై తనను విమర్శించిన యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తన బెడ్‌రూమ్ విషయాలపై పగటి కలలు కనడం కాకుండా పతంజలి వివాదాన్ని గుర్తు చేశారు.

- నీట్ నిరసనలపై యువతను 'జనరేషన్ గట్టర్' అని కంగనా వ్యాఖ్యానించారు.
- బాబా రామ్‌దేవ్ కంగనాపై తీవ్ర విమర్శలు చేస్తూ ఆమె అర్హతలను ప్రశ్నించారు.
- రామ్‌దేవ్ గతంలోని కేసులను ప్రస్తావిస్తూ కంగనా గట్టి బదులిచ్చారు.
Kangana Ranaut vs Baba Ramdev: బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ప్రముఖ యోగా గురువు, పతంజలి సంస్థల సహ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ మధ్య ప్రస్తుతం తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. దేశంలోని యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ గతంలో చేసిన జనరేషన్ గట్టర్ వ్యాఖ్యలతో ఇరువురు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన వ్యాఖ్యలను తప్పుపడుతూ, తన వ్యక్తిత్వాన్ని, గతాన్ని ప్రశ్నించిన బాబా రామ్‌దేవ్‌పై కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు.
ఈ వివాదంలో కంగనా రనౌత్ నేరుగా బాబా రామ్‌దేవ్‌కు తన వ్యక్తిత్వం గురించి నీతులు చెప్పవద్దని హితవు పలికారు. అంతేకాకుండా పతంజలి బ్రాండ్ తప్పుడు ప్రకటనల కేసులో 2024లో బాబా రామ్‌దేవ్ , ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మందలించిన విషయాన్ని గుర్తు చేశారు. తనపై ఎటువంటి మోసపూరితమైన ఆరోపణలు లేదా కేసులు రుజువు కాలేదని, కాబట్టి తన క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత రామ్‌దేవ్‌కు లేదని చెప్పారు.
వివాదం ఎలా ప్రారంభమైంది?
గత నెలలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌్ వద్ద జరిగిన నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేక విద్యార్థి నిరసనల్లో ఉన్నాయి. ఈ నిరసనలకు సంబంధించిన కొన్ని వీడియోలను చూసిన తర్వాత కంగనా రనౌత్ సోష్ మీడియా వేదికగా తీవ్రమైన అసంతృప్తిని, అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్టు చేశారు.
నిరసనలలో పాల్గొంటున్న యువత భాష, వారి ప్రవర్తన అసహ్యం కలిగించే విధంగా ఉన్నాయని కంగనా పేర్కొన్నారు. తల్లిదండ్రులపై ఆర్థికంగా ఆధారపడుతూ స్వేచ్ఛను దుర్వినియోగ చేస్తున్నారని మాదకద్రవ్యాల వాడకం, మద్యపాన అలవాట్లను గ్లోరిఫై చేస్తున్నారని ఆరోపించారు.
స్వతంత్ర వృత్తిరమైన మహిళల జీవితాలను అనుసరించాలని భావిస్తున్న కొంతమంది యువ హిందూ మహిళలను ఉద్దేశించి, వారు ఆ స్వచ్ఛను సంపాదించకుండానే వారిలా జీవించాలని చూస్తున్నారని విమర్శించారు. వారికి వ్యవస్థను అందించేందుకు ఏమీ లేదని, చదువులో రాణించలేరని, బాడీ కౌంట్ వంటి పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అటువంటి ప్రవర్తన కలిగిన యువతను జనరేషన్ గట్టర్ లేదా వెస్ట్రనైజ్డ్ గట్టర్ అని పిలిచారు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఆ తర్వాత కంగనా రనౌత్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను దేశంలోని యువత మొత్తాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, కేవలం జంత్ మంతర్ నిరసనల్లో అసభ్యకరంగా ప్రవర్తించిన కొంతమంది వ్యక్తులను లేదా కొందరు మహిళలను మాత్రమే ప్రత్యేకగా ప్రస్తావించనని స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన వారు తమను తాము కాక్రోచ్ అని పిలుచుకుంటే బొద్దింకలు మురికి కాలువలోనే జీవిస్తాయని కదా అని ప్రశ్నించారు. డ్రగ్స్ వ్యసనం, జూదం, బెట్టింగ, డార్క్ వెబ్ వంటి వ్యసనాల్లో ఉన్న యువతను ప్రశ్నించడం దేశ యువత మొత్తాన్ని అవమానించడం కాదని ఆమె సమర్థించుకున్నారు.
బాబా రామ్‌దేవ్ తీవ్ర విమర్శలు
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యోగా గురు బాబా రామ్‌దేవ్‌ను కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, ఆయన ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ యువతను అవమానించేందుకు ఆమెకు ఉన్న అర్హతలు ఏంటని ప్రశ్నించారు." ఆమె అర్హత ఏంటి? ఆమె బాల్యం ఎలా గడిచింది? ఆమె యవ్వనం ఎలా సాగింది? ఆమె గత చర్యలు, విజయాలు ఎలాంటివి? ఇలాంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడటానికి కూడా ఇష్టపడను. మన దేశ యువతను లేదా జన్‌జీని మురికికాలువ అని పిలవడం ఒక కలుషితమైన మనస్తత్వానికి నిదర్శనం. ఇది చాలా తప్పు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీ కూడా దీనిని గమనించాలి" ని అన్నారు.
వ్యక్తిగత పాఠాలు వద్దంటూ కంగనా కౌంటర్
బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యలు మీడియాలో ప్రసారమైన వెంటనే, కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. రామ్‌దేవ్ వ్యాఖ్యలు ఉన్న ఒక వార్తా కథనం స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ ఆమె నేరుగా రామ్‌దేవ్ వ్యక్తిత్వాన్ని, ఆయన సంస్థలపై ఉన్న ఆరోపణలను ఎండగట్టారు. " బాబాజీ, నా యువ్వనం లేదా బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనడం ఆపండి. కేవలం పుకార్లు, గాసిప్‌ల ఆధారంగా మాత్రమే ఎవరైనా ఊహించగలరు. కనీసం నాకు ఎప్పుడూ నకిలీ లేదా మోసపూరితమైన మెడికల్ క్లెయిమ్‌ల ఆధారంగా సుప్రీంకోర్టు నుంచి తీవ్రమైన మందలింపులు రాలేదు. నా సమాధానాలు కఠినమైన వాస్తవాలై ఆధారపడి ఉంటాయి. ఊహాగానాలపై కాదు. కాబట్టి నాకు క్యారెక్టర్ పాఠాలు చెప్పకండి. నా క్యారెక్టర్ మీ కంటే చాలా చాలా మెరుగైనది. నా పేరు మీద ఎలాంటి ఫ్రాడ్ కేసులు నమోదు కాలేదు." అని అన్నారు.

ఇలా వీరిద్దరి మధ్య సాగుతున్న వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కంగనా వ్యాఖ్యలపై బాబా రామ్‌దేవ్ ఒక్కరే కాదు చాలా మంది తప్పుపట్టారు. వారందరికీ కంగనా ఇదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.
Frequently Asked Questions
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, బాబా రామ్‌దేవ్ మధ్య వివాదం దేని గురించి?
వివాదం ఎలా ప్రారంభమైంది?
గత నెలలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ పేపర్ లీకేజీ నిరసనల్లో పాల్గొన్న యువత ప్రవర్తనపై కంగనా రనౌత్ చేసిన
కంగనా వ్యాఖ్యలపై బాబా రామ్‌దేవ్ ఎలా స్పందించారు?
కంగనా దేశ యువతను అవమానించేందుకు ఆమెకున్న అర్హత ఏంటని రామ్‌దేవ్ ప్రశ్నించారు. ఆమె బాల్యం, యవ్వనం, గత చర్యలు, విజయాలు ఎలాంటివో అడిగారు.
రామ్‌దేవ్ విమర్శలకు కంగనా ఎలా బదులిచ్చారు?
తన వ్యక్తిత్వం గురించి నీతులు చెప్పవద్దని కంగనా రామ్‌దేవ్‌కు హితవు పలికారు. పతంజలి బ్రాండ్ తప్పుడు ప్రకటనల కేసులో సుప్రీంకోర్టు రామ్‌దేవ్‌ను మందలించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ట్రెండింగ్ వార్తలు





















