మనుషుల ప్రాణాలతో చైనా చెలగాటం! మెదడుని మెలిపెట్టే వైరస్‌తో పిచ్చి ప్రయోగాలు
China Experiment: చైనా ఓ ప్రాణాంతక వైరస్‌తో ఎలుకపై ప్రయోగాలు చేయడం గుబులు పుట్టిస్తోంది.
China Experiment With Deadly Virus: చైనా ఓ ప్రాణాంతక వైరస్‌తో ప్రయోగాలు చేస్తోంది. ఓ ఎలుకపై ప్రయోగిస్తే అది వెంటనే చనిపోయిందట. ఆ వైరస్ పేరు GX_P2V అని ఓ అధ్యయనం వెల్లడించింది. నేరుగా ఎలుక బ్రెయిన్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ వైరస్‌ని ప్రయోగించారు. ఐదు రోజుల్లోనే ఆ ఎలుకలో మార్పులు కనిపించాయి. బరువు తగ్గిపోవడంతో పాటు, నీరస పడిపోయిందని, కళ్లు తెల్లగా మారిపోయాయని ఆ అధ్యయనం వివరించింది. ఈ వైరస్ ప్రయోగించిన 8 రోజులకు అది చిక్కిశల్యమై ప్రాణాలు విడిచింది. ఎలుక చనిపోవడాన్ని చూసి సైంటిస్ట్‌లు షాక్ అయ్యారట. ఆ తరవాత ఎందుకు చనిపోయిందో పూర్తిస్థాయిలో స్టడీ చేశారు. వైరస్‌ని ప్రయోగించిన తరవాత ఎలుక ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్లు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపించిందని తేల్చారు. బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్ కారణంగానే చనిపోయిందని గుర్తించారు. అంటే ఈ వైరస్ నేరుగా మెదడుపైనే ప్రభావం చూపిస్తోందని తేల్చి చెప్పారు. బీజింగ్ యూనివర్సిటీలో కెమికల్ టెక్నాలజీ విభాగంలో ఈ ప్రయోగం చేశారు. కొవిడ్ రాక ముందు 2017లో Sars-CoV-2 అనే వైరస్‌ని గుర్తించారు. ఇప్పుడు ఎలుకపై ప్రయోగించిన వైరస్ కూడా దాదాపు ఇలాంటిదే. అంటే...ఇది కొవిడ్‌కి సంబంధించిన వైరస్ అన్నమాట. దీనికి 100% Mortality Rate ఉండడమే ఆందోళన కలిగిస్తున్న విషయం. అయితే...ఇది మనుషులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది మాత్రం స్పష్టత లేదు. ఈ స్టడీని ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసిన వెంటనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కొంతమంది ఎక్స్‌పర్ట్‌లు ఇవేం ఆటలు అంటూ మండి పడుతున్నారు. ఇలాంటి ప్రయోగాల గురించి వింటనే వెన్నులో వణుకు పుడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. X వేదికగా కొందరు తమ అసహనాన్ని బయట పెట్టారు. "ఆలస్యం కాకముందే ఇలాంటి పిచ్చి ప్రయోగాలను అడ్డుకోవాలి" అని మరి కొందరు డిమాండ్ చేస్తున్నారు.