Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్ పొడగింపు- పిటిషన్‌పై తీర్పులు మధ్యాహ్నానికి వాయిదా
Chandrababu Arrest: విజయవాడ ఏసీపీ ప్రత్యేక న్యాయస్థానం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను కోర్టు పొడగించింది.
Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను ఏసీబీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. చంద్రబాబు విధించిన జ్యుడీషియల్ రిమాండ్ శుక్రవారం ముగిసింది. ఈక్రమంలోనే తదుపరి ఆదేశాల కోసం ఆయనను విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో వర్చువల్ పద్ధతిలో హాజరు పరిచారు. దీంతో చంద్రబాబు రిమాండ్ ను ఈనెల 24వ తేదీ వరకు కోర్టు పొడిగించింది.
విచారణలో భాగంగా చంద్రబాబు నాయుడు న్యాయమూర్తితో మాట్లాడారు. తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది అని చెప్పుకొచ్చారు. తనకు నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారని అన్నారు. తన తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సిందేనని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందన్నారు. అన్యాయంగా తనను అరెస్టు చేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన అంటూ వివరించారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని అన్నారు. తనపై ఉన్నవి ఆరోపణలు మాత్రమేనని.. తప్పు నిర్ధారణ కాలేదని వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని.. చట్టాన్ని గౌరవిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. న్యాయం గెలవాలి.. చట్టం ముందు అందరూ సమానమే అంటూ బాబు స్పష్టం చేశారు.
మరోవైపు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్ని సీఐడీ అధికారుల పిటిషన్ తీర్పును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు 1.30కి ఉన్నందున ఈ తీర్పును 2.30కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు పేర్కొంది.
Read Also: జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- సభ నుంచి టీడీపీ లీడర్ల సస్పెన్షన్