By: ABP Desam | Updated at : 22 Sep 2023 11:17 AM (IST)
జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- అచ్చెన్న, అశోక్ సస్పెన్డ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు ఇష్యూ చుట్టే ఏపీ అసెంబ్లీ తిరుగుతోంది. రెండో రోజు ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభం కాకముందే సభ మొదటిసారి వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం ప్రారంభమైనా సభలో గందరగోళం నెలకొంది. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.
రెండో రోజు సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. అయినా ప్రశ్నోత్తరాలు కొనసాగించేందుకు స్పీకర్ ప్రయత్నించారు. మంత్రి అమర్‌నాథ్ లేచి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంటే టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగించారు.
సైకో ప్రభుత్వం అంటూ నినాదాలు చేయడంపై మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో ఉన్న వారంతా అనుభవం ఉన్న వ్యక్తులేనని.. వారి నోటి వెంట ఇలాంటి పదాలు రావడం ఏంటని ప్రశ్నించారు. ఇదే కంటిన్యూ అయితే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. చంద్రబాబు కేసులపై అన్నింటినీ పూర్తిగా చర్చిద్దామని బుగ్గన అన్నారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హెచ్చరించినప్పటికీ టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. మరింత రెట్టించిన స్వరంతో సైకో ప్రభుత్వం పోవాలి... చంద్రబాబుపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇలా గట్టిగా నినాదాలు చేయడంతో బుగ్గన కూర్చోగానే మంత్రి అంబటి రాంబాబు లేచారు.
టిడీపీ లీడర్లు ఇలా చేస్తుంటే తమ సభ్యుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి ఉంటుందని రాంబాబు హెచ్చరించారు. తాము మాట్లాడితే టీడీపీ లీడర్లు తట్టుకోలేరని హెచ్చరించారు. ఇ క్రమంలోనే సభను మొదటిసారి స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం వాయిదా తర్వాత కూడా సభలో ఎలాంటి మార్పు రాలేదు. టీడీపీ సభ్యులు నినాదాలు కంటిన్యూ చేశారు.
ఇంతలో వైసీపీ సభ్యులు, మంత్రులు లేచి టీడీపీ సభ్యులను టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారు. సైకో పాలన పోయిందని.. ఖైదీగా జైల్లో ఉన్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. సైకోలు వచ్చి సభను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. బాలకృష్ణ కవర్ వేసుకొని వచ్చారని... దానిపై బాలకృష్ణ ఫొటో లేదని అన్నారు. సైకో అయిన వాళ్ల బావ జైల్లో ఉన్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని దోచుకున్న చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నారని అన్నారు.
సభలో అనుమతి లేకండా వీడియో షూట్ చేస్తున్నారని ఆరోపణలతో అచ్చెన్నాయుడు, అశోక్‌ను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వారిద్దరిని సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. వారు బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకెళ్లారు.
అనంతరం మాట్లాడిన మంత్రులు అంబటి, కాకాణి గోవర్ధన్ రెడ్డి.. టీడీపీ సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. సభా మర్యాద లేకుండా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీట్లపై నిల్చొని నినాదాలు చేయడం పద్దతి కాదన్నారు. టీడీపీ సభ్యులకు దమ్ము లేదు కాబట్టే చర్చలో పాల్గొనకుండా పారిపోతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ సీటు కూడా టీడీపీ రాదని ఇప్పుడు ఆందోళన చేసిన వారంతా ఇంట్లో కూర్చోవాల్సిందేనన్నారు. మాట్లాడిన వారంతా టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుపై పెట్టిన కేసులపై చర్చించాలని టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు. దీనిపై షార్ట్ డిస్కషన్ ఉందని అందులో పాల్గొనాలని సూచించారు. టీ విరామం తర్వాత కూడా సభ ఆర్డర్‌లోకి రాలేదు. దీంతో టీడీపీ సభ్యుల్లో ముగ్గుర్ని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. దీంతో మిగతా సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
Breaking News Live Telugu Updates: యశోద హాస్పిటల్లో కేసీఆర్‌ను పరామర్శించిన చిన్న జీయర్ స్వామి
Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్ క్లోజ్
APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా
APPSC Group-1: ఏపీపీఎస్సీ 'గ్రూప్-1' నోటిఫికేషన్ విడుదల, పోస్టుల వివరాలు ఇలా
AP Tenth: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>