Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్, నేడు 11 గంటల పాటు ఆలయం మూసివేత
నేడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో 11 గంటల పాటు ఆలయం మూసివేస్తారు. గ్రహణ సమయంలో అన్నప్రసాద వితరణ కూడా ఉండదని టీటీడీ అధికారులు ప్రకటించారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. నేడు శ్రీవారి ఆలయంను చంద్రగ్రహణం కారణంగా కొన్ని గంటలపాటు మూసివేయనున్నారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు తెలిపారు. సోమవారం నాడు 74,094 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇందులో 21,475 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 4.52 కోట్ల రూపాయలు హుండీ ద్వారా ఆదాయం లభించింది. మంగళవారం శ్రీవారి ఆలయం 11 గంటల పాటు మూసి వేయనుంది టిటిడి. గత నెలలో సూర్యగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేశారు. ఆ తరువాత నేడు చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో శ్రీవారి ఆలయం తలుపులు మూసి వేయనున్నారు.
నేడు పలు కార్యక్రమాలు రద్దు చేసిన టీటీడీ
నేడు (నవంబరు 8వ తేదీన) చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో 11 గంటల పాటు ఆలయం మూసివేస్తారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు కూడా రద్దు చేశారు. గ్రహణ సమయంలో అన్నప్రసాద వితరణ కూడా ఉండదని అధికారులు ప్రకటించారు. నవంబరు 8న గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం 11 గంటల పాటు మూసివేస్తారు. బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను అన్నీ రద్దుచేసింది టీటీడీ. గ్రహణం కారణంగా నవంబరు 8వ తేదీ తిరుపతిలో జారీ చేసే ఎస్ఎస్‌డీ టోకెన్లు రద్దు చేశారు. అయితే, గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం 2 నుండి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. 8వ తేదీన మధ్యాహ్నం 2.39 గంటల నుండి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని, ఈ కారణంగా ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్టు వెల్లడించారు.
సాధారణంగా గ్రహణం రోజుల్లో గ్రహణం తొలగిపోయే వరకు వంట చేయరు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. తిరిగి రాత్రి 8.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుందని టీటీడీ స్పష్టం చేసింది. చంద్రగ్రహణం కారణంగా నవంబరు 8న మంగళవారం ఉదయం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు 11 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టిటిడి స్పష్టం చేసింది.
సాగరానికి రత్నగర్భ హారతి
కార్తీక పౌర్ణమి సందర్భంగా బాపట్ల సూర్యలంక సముద్ర తీరంలో భక్తుల సందడి నెలకొంది. పవిత్ర కార్తీకమాసంలో సముద్ర స్నానం చేస్తే సకల పాప హరణం జరుగుతోందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం చేస్తే సద్గతులు ప్రాప్తిస్తాయి అని ప్రజలు భావిస్తారు. సూర్యలంక సముద్ర తీరంలో కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా సాగర రత్నగర్భ హారతిని ఇస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్లించడానికి తీరానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు.వేకువ ఝామున జరిగిన సాగర రత్న గర్భ హారతి కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి సతీ సమేతంగా పాల్గొని సాగరానికి రత్నగర్భ హారతి ఇచ్చారు. ఉదయం నుంచి పవిత్ర సాగర స్నానాలు చేసేందుకు మహిళాలు పెద్ద సంఖ్యలో సూర్యలంక బీచ్ కు చేరుకున్నారు.. తీరంలో కార్తీక దీపాలు వెలింగించి ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమార్చన చేసారు. అనంతరం సాగరంనికి దీపాలు నినేదించారు. చంద్ర గ్రహమం కారంణంగా భక్తులు పెద్దగా సముద్ర స్నానంపై ఆసక్తి చూపలేదు.