Bangladesh: మరో పాకిస్తాన్‌గా మారుతున్న బంగ్లాదేశ్ - హిందువులపై అంతకంతకూ పెరుగుతున్న దాడులు
Bangladeshi Hindu: బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగలేదని మహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వం చెబుతోంది. కానీ అక్కడ జరుగుతున్న దారుణాలు ఎక్కువగా ఉన్నాయి.
Attacks On Bangladeshi Hindu: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత మైనారిటీలపై చాలా హింస జరుగుతోంది. కానీ ప్రజామోదం లేకుండా ఏర్పడిన మహమ్మద్ యూనస్ యొక్క మధ్యంతర ప్రభుత్వం దీనిని అంగీకరించడానికి సిద్ధంగా లేదు. బంగ్లాదేశ్ లో ఈ ఏడాది హిందువులు, ఇతర మైనారిటీలపై 2,200 దాడులు జరిగాయి. అదే సమయంలో కిస్థాన్ లో 112 దాడులు మాత్రమే జరిగాయని తాజాగా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. బంగ్లాదేశ్ కొత్త పాకిస్తాన్ గా మారిందని, అక్కడ హిందువులు, ఇతర మైనారిటీలు హింసకు గురవుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.
హిందువులకు రక్షణ కల్పించాలని కేంద్రం లేఖలు
వారి వారి దేశాల్లోని హిందువులకు భద్రత కల్పించాలని కోరుతూ బంగ్లాదేశ్, పాకిస్థాన్ రెండు దేశాలకు లేఖలు రాసినట్లు విదేశాంగ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని, పొరుగు దేశ ప్రభుత్వాలకు ఆందోళన వ్యక్తం చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మైనారిటీ హిందువుల రక్షణకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని భారత్ ఆశిస్తోంది. విదేశాంగ కార్యదర్శి బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా కూడా ఇదే సందేశాన్ని ఇచ్చారు. ఢాకాలోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ దాడుల సంఘటనలను నిశితంగా పరిశీలిస్తోందని" కేంద్రం తెలిపింది.
ఈ ఏడాదిలో బంగ్లాలో హిందువులపై లెక్కలేనన్ని దాడులు
బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో ఏ సంవత్సరంలో ఎన్ని దాడులు జరిగాయో గణాంకాలను సమర్పించిన విదేశాంగ మంత్రి వివరించారు.
సంవత్సరం బంగ్లాదేశ్ పాకిస్తాన్
2022 47 241
2021 302 103
2024 2200 112
రాజకీయ కారణాలతో హిందువుల టార్గెట్
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం చూస్తే.. బంగ్లాదేశ్‌లో 2022 వరకు చాలా తక్కువ దాడులు హిందువులపై జరిగాయి. అప్పటి వరకూ ఆ దేశంలో అందరూ కలసి మెలిసి ఉండేవారు. కానీ తరవాత సొంత ప్రజాప్రభుత్వంపై కుట్రలు చేసుకున్న అక్కడి పార్టీలు హిందువులపై ద్వేషం పెంచడం ద్వారా రాజకీయాలు చేశాయి. వారిపై దాడులను కామన్ గా మార్చుకున్నాయి. దాని వల్ల ఈ ఒక్క ఏడాదే 2200 దాడులు హిందువులపై జరిగినట్లుగా స్పష్టమవుతోంది. కానీ బంగ్లా ప్రభుత్వం మాత్రం హిందువులపై దాడులు జరగడం లేదని వాదిస్తోంది.
Also Read: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో