Watch Video: నడిరోడ్డుపై మహిళను చితకబాదిన యువతులు- వైరల్ వీడియో!
Watch Video: ఓ మహిళను నడిరోడ్డుపై నలుగురు యువతులు చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Watch Video: సాధారణంగా అప్పుడప్పుడు యువకులు వీధుల్లో తాగేసి కొట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ యువతులు ఇలా చేయడం ఎప్పుడైనా చూశారా? ఓ మహిళలు నలుగురు యువతులు నడిరోడ్డుపై దారుణంగా కొడుతోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ సంగతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. ఓ మహిళను నలుగురు యువతులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టారు. ఇండోర్‌లోని ఎల్ఐజీ ఇంటర్‌సెక్షన్ సమీపంలోని ఓ ఫుడ్ స్టాల్ ఎదుట ఈ గొడవ జరిగింది.
इंदौर की गुण्डिया इनका पूरा गैंग एक लड़की को की धुनाई करने में जुटा हुआ है pic.twitter.com/iDWep3A4y1
— Tushar Srivastava (@TusharSrilive) November 7, 2022
ఈ వీడియోలో ఓ మహిళపై యువతులు పిడిగుద్దులు కురిపించారు. బాధితురాలిని బెల్ట్‌తో కొట్టారు. చుట్టుపక్కల వాళ్లు ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. నలుగురు యువతులు.. ఆ మహిళలపై దాడి చేస్తున్నప్పుడు కొంతమంది వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు యువతులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇలాంటిదే
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ అపార్ట్‌మెంట్ రెసిడెంట్స్ సొసైటీ ఎన్నికలు కుమ్ములాటకు దారి తీశాయి. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. మహిళలు జుట్లు పట్టుకుని ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నోయిడా సెక్టార్ 78లోని హైడ్ పార్క్ సొసైటీలోని ఓ ఆపార్టుమెంట్ రెసిడెంట్స్ సొసైటీ ఎన్నికలు ఇటీవల జరిగాయి. అయితే ఎన్నికల్లో పోటీపడుతున్న ఒక వర్గం వారికి అపార్టుమెంట్ సెక్యూరిటీ గార్డులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మరో వర్గం మహిళలు గొడవ చేశారు. దీంతో మహిళా సెక్యూరిటీ గార్డులు సదరు మహిళలపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన సెక్యూరిటీ గార్డుల్లో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.
#WATCH | UP: Two groups of people supporting different candidates for post of Apartment Owners Association President of Noida's Hyde Park society got into a clash yesterday. 2 women had minor injuries. Complaint registered, 2 guards detained: DCP Noida
— ANI (@ANI) October 21, 2022
(Vid source: Viral video) pic.twitter.com/SCHfwwM9w9
Also Read: Emaar Tower Fire: బుర్జ్ ఖలీఫా సమీపంలో భారీ అగ్నిప్రమాదం- వైరల్ వీడియో!