News
News
వీడియోలు ఆటలు
X

Sundar Pichai : నిన్న పద్మభూషణ్ - ఇవాళ కాపీరైట్ కేసు.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు షాక్ !

కాపీరైట్స్ తీసుకోకుండా తన సినిమాను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారని ఓ దర్శకనిర్మాత ఫిర్యాదు చేయడంతో సుందర్ పిచాయ్‌పై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ముంబై పోలీసులు.

FOLLOW US: 
Share:

అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్‌ను భారత దేశం గర్వించే వ్యక్తిగా పేర్కొంటూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. అయితే ఇలా ప్రకటించిన ఒక్క రోజుకే ఇండియాలో ఆయనపై కేసు నమోదయింది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు పిచాయ్‌తో పాటు ఐదుగరు కంపెనీ ప్రతినిధులపైనా కేసు బుక్‌ చేసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కాపీరైట్‌ యాక్ట్‌ వయొలేషన్‌ కింద ఈ కేసు నమోదు అయింది. 

"ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా" అనే సినిమాను కొంత మంది యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. ఈ సినిమా దర్శక, నిర్మాత అయిన సునీల్‌ దర్శన్‌ అక్రమంగా అప్ లోడ్ చేశారని.. రైట్స్ ఎవరికీ విక్రయించలేదని కోర్టును ఆశ్రయించారు. ఇందులో గూగుల్ కంపెనీ ప్రతినిధుల పేర్లను ప్రతివాదులుగా చేర్చారు. తన సినిమా హక్కుల్ని ఎవరికీ అమ్మలేదని, అలాంటిది యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందని సునీల్‌ కోర్టులో వాదించారు. ఇల్లీగల్‌ అప్‌లోడింగ్‌ విషయంలో యూట్యూబ్‌కు ఎన్ని ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు. విచారణ తర్వాత కోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. 

ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా 2017లో రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాలో పేరున్న నటులు ఎవరూ లేరు. సినిమా మొత్తాన్ని లండన్‌లో చిత్రీకరించారు.  సహజంగానే ఈ సినిమా వచ్చింది.. వెళ్లింది అన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు.  యూట్యూబ్‌లో పెట్టినా చూసేవాళ్లు లేరు. కానీ సునీల్ దర్శన్ మాత్రం కోర్టుకెక్కారు. చివరికి గూగుల్ సీఈవోకి కూడా నోటీసులు వెళ్లేలా చేయగలిగారు. అయితే ఇదంతా సునీల్ దర్శన్ పబ్లిసిటీ కోసం చేస్తున్నారన్న కామెంట్లు కూడా ఎక్కువే వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో ప్రచారం కోసం ఇలాంటి పనులు చేస్తూంటారని అంటున్నారు. మొత్తానికి  నిన్న పద్మభూషణ్ పురస్కారం..ఇవాళ కేసు ... ఈ రెండూ  సుందర్ పిచాయ్‌కు కట్టా..మీఠా టైపులో ఉంటాయని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   

Published at : 26 Jan 2022 06:02 PM (IST) Tags: google ceo sundar pichai Case Against Pichai Sunder Pichai Padma Bhushan Ek Hasina The Ek Diwana Tha

సంబంధిత కథనాలు

New Parliament Opening: పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేకంలా ఫీల్ అవుతున్నారు - ప్రధానిపై రాహుల్ సెటైర్లు

New Parliament Opening: పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని పట్టాభిషేకంలా ఫీల్ అవుతున్నారు - ప్రధానిపై రాహుల్ సెటైర్లు

GSLV - F12 Launch: తిరుమల శ్రీవారి పాదాల చెంత జీఎస్ఎల్వీ ఎఫ్-12 నమూనా, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు

GSLV - F12 Launch: తిరుమల శ్రీవారి పాదాల చెంత జీఎస్ఎల్వీ ఎఫ్-12 నమూనా, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు

New Parliament: కొత్త పార్లమెంట్‌ చూడాలనుకుంటున్నారా, అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే

New Parliament: కొత్త పార్లమెంట్‌ చూడాలనుకుంటున్నారా, అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్‌ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

New Parliament Opening: కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం

New Parliament Opening:  కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం

టాప్ స్టోరీస్

Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

Telangana Politics :  అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

NTR - Balakrishna : బాలకృష్ణకు ముందే చెప్పిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్

NTR - Balakrishna : బాలకృష్ణకు ముందే చెప్పిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?