Chiranjeevi - Gareth Wynn Owen: తెల్ల దొరకు తెలుగు ఆవకాయ రుచి చూపించిన మెగాస్టార్!
Chiranjeevi- Gareth Wynn Owen: మెగాస్టార్ చిరంజీవిని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Chiranjeevi- Gareth Wynn Owen: బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్.. మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను మెగాస్టార్ చిరు.. ట్విట్టర్‌లో షేర్ చేశారు. బ్రిటన్, భారత్‌కు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు చిరు తెలిపారు.
Delighted to meet Gareth Wynn Owen @UKinHyderabad the new British Dy High Commissioner in town.Exchanged courteous notes on many topics of UK,India & Telugu states over dinner at my place. Got him to taste some traditional Telugu delicacies,not to forget some spicy #Avakaya 😊 pic.twitter.com/CF8rx7bUBS
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 1, 2022
మర్చిపోలేను
మెగాస్టార్‌తో భేటీ తర్వాత బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ కూడా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. టాలీవుడ్ పరిశ్రమ గురించి మెగాస్టార్‌తో చర్చించినట్లు చెప్పారు. కరోనా సమయంలో మెగాస్టార్ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. భేటీకి సంబంధించిన ఫొటోలను సైతం పోస్టు చేశారు.
Thank you for hosting me in your beautiful home and introducing me to home made steamed dosa and avakaya. It was a special evening I will remember for a long time, and I look forward to meeting you at one of your blood donation centres. https://t.co/UzMymjpKyC
— Gareth Wynn Owen (@UKinHyderabad) November 1, 2022
Also Read: Sukesh Chandrashekhar: 'జైల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ కోసం జైన్‌కు రూ.10 కోట్లు లంచం ఇచ్చా'