News
News
X

Sukesh Chandrashekhar: 'జైల్లో వీఐపీ ట్రీట్‌మెంట్‌ కోసం జైన్‌కు రూ.10 కోట్లు లంచం ఇచ్చా'

Sukesh Chandrashekhar: ఆమ్‌ఆద్మీ పార్టీకి తాను కోట్ల రూపాయలు సమకూర్చానని రూ.200 కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ఆరోపించాడు.

FOLLOW US: 
 
Sukesh Chandrashekhar: రూ.200 కోట్ల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌.. దిల్లీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశాడు. జైల్లో రక్షణ కల్పిస్తానంటూ దిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌ తన నుంచి బలవంతంగా రూ.10 కోట్లు వసూలు చేశారని సుకేశ్ ఆరోపించాడు. ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖ రాశాడు.

లేఖలో ఇలా 

ఆమ్‌ఆద్మీ దక్షిణాదిలో విస్తరించిన తర్వాత తనకు కీలక పదివి ఇస్తానని పార్టీ నేతలు చెప్పినట్లు సుకేశ్ ఆరోపించాడు. ఇందు కోసం తన నుంచి రూ.50 కోట్ల వరకు వసూలు చేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. డబ్బు తీసుకుని ప్రస్తుతన తనను సత్యేంద్ర జైన్ బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నాడు.

ఇటీవల ఈడీ దర్యాప్తులో దీని గురించి తాను అధికారులకు చెప్పినట్లు సుకేశ్ పేర్కొన్నాడు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేసినట్లు తెలిపాడు.

News Reels

" ఆమ్‌ ఆద్మీ పార్టీకి నేను కోట్లాది రూపాయాలు సమకూర్చాను. 2015 నుంచి సత్యేంద్ర జైన్‌తో నాకు పరిచయం ఉంది. ఆమ్‌ఆద్మీ పార్టీ విస్తరణ తర్వాత రాజ్యసభకు నామినేట్‌ చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాకు హామీ ఇచ్చింది. దీంతో ఆ పార్టీకి నేను రూ.50 కోట్లకు పైగా డబ్బు సమకూర్చాను. 2017లో నేను అరెస్టయిన తర్వాత తిహాడ్‌ జైల్లో ఉంచారు. అప్పుడు జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్‌ నన్ను కలిశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఇచ్చిన డబ్బు గురించి దర్యాప్తు సంస్థలకు ఏమైనా చెప్పావా? అని అడిగారు.  ఆ తర్వాత 2019లో మరోసారి అరెస్టయినప్పుడు సత్యేంద్ర జైన్‌ తన సెక్రటరీ, మరో సన్నిహితుడితో జైలుకు వచ్చి నన్ను కలిశారు. జైల్లో రక్షణ, సదుపాయాలు కల్పించాలంటే ప్రతినెలా తనకు రూ.2 కోట్లు కట్టాలని జైన్‌ డిమాండ్ చేశారు. అంతేగాక డీజీ (జైళ్లు) సందీప్‌ గోయెల్‌కు ప్రతినెలా రూ.1.5కోట్లు ఇవ్వాలన్నారు. నాపై ఒత్తిడి పెంచి కొన్ని నెలలు బలవంతంగా కట్టించుకున్నారు. అలా సత్యేంద్ర జైన్‌కు రూ.10 కోట్లు, సందీప్‌ గోయెల్‌కు రూ.12.5 కోట్లు చెల్లించాను. జైన్‌కు డబ్బులు ఇచ్చినట్లు నా వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలి.                     "
- సుకేశ్‌ చంద్రశేఖర్

ఈ కేసులో

సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి జాక్వెలిన్ లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించింది ఈడీ. సుఖేశ్ చంద్రశేఖర్ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని అయినప్పటికీ అతనితో స్నేహంగా ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. 

సుకేశ్ చంద్రశేఖర్‌తో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అతని నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు ఈడీ అధికారుల విచారణలో తేలింది. దాదాపు రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైనా సుకేశ్‌ గురించి ముందే తెలిసినా.. అతడి నుంచి విలువైన బహుమతులు తీసుకోవడంలో ఆమె ఎలాంటి సంకోచం వ్యక్తం చేయలేదని ఈడీ అధికారులు తెలిపారు.

ఎంతో విలువైన డిజైనర్ బ్యాగులు, వజ్రాలు, బ్రాస్‌లెట్లు, జిమ్ సూట్లు, మినీ కూపర్ ఇలా చాలా విలువైన వస్తువులు తను తీసుకుందని ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన బహుమతులను జాక్వెలిన్‌కు సుకేశ్ ఇచ్చాడని అధికారులు వివరించారు. సుకేశ్ గురించి వార్తలు వచ్చిన సందర్భంలోనే... అతను ఈ శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ ఫోటోల్లో జాక్వెలిన్ సుకేశ్‌తో చాలా సన్నిహితంగా ఉన్నట్లు కనిపించింది. 

Also Read: Morbi Bridge Tragedy: గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై విచారణకు సుప్రీం ఓకే

Published at : 01 Nov 2022 03:50 PM (IST) Tags: Sukesh Chandrashekhar satyendar jain Delhi Minister Paid Rs 10 crore

సంబంధిత కథనాలు

రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఏపీకి వస్తున్న ద్రౌపది ముర్ము- గ్రాండ్‌ వెల్‌కమ్‌కు ఏర్పాట్లు!

రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఏపీకి వస్తున్న ద్రౌపది ముర్ము- గ్రాండ్‌ వెల్‌కమ్‌కు ఏర్పాట్లు!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

DME Recruitment: ఏపీ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే!

DME Recruitment: ఏపీ వైద్య కళాశాలల్లో 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, అర్హతలివే!

TSLPRB Police Physical Events: పోలీస్ ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు నేడే ఆఖరు! వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి!

TSLPRB Police Physical Events:  పోలీస్ ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు నేడే ఆఖరు!   వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి!

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

TS News Developments Today: తెలంగాణలో ఇవాళ ఉన్న మెయిన్ ఇష్యూస్ ఏంటంటే?

టాప్ స్టోరీస్

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Andhra Teachers APP Problems : ఎన్నికలు, జనగణన కాదు అసలు సమస్య యాప్‌లే - టీచర్లు  గోడు ప్రభుత్వం ఆలకిస్తుందా ?

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

Viral News: గురివింద మొక్క నాగుపాము కంటే డేంజర్ అంటే నమ్ముతారా!

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

కారు డాష్‌బోర్డుపై పెర్ఫ్యూమ్‌, దేవుడి బొమ్మలు పెడుతున్నారా - ఎంత ప్రమాదమో తెలుసా?

టీటీడీ బోర్డు మెంబర్‌ రియల్ మోసం- అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు

టీటీడీ బోర్డు మెంబర్‌ రియల్ మోసం- అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులు