Breaking News: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల
Breaking News: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
LIVE
Background
Breaking News: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలోఘోర ప్రమాదం జరిగిది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 18 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. మొదట్లో ఒకరే చనిపోయారని అనుకున్నా అది అలా పెరుగుతూ పోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. గ్యాస్ లికేజీ కారణంగా ఎగసిపడుతున్న మంటలను అతికష్టమ్మీద ఆర్పే ప్రయత్నాలు చేశారు. చివరకు మంటలు అదుపులోకి వస్తే తప్ప మృతుల వివరాలు తెలియలేదు. ప్రమాదం తీవ్రత కూడా తెలిసి రాలేదు.
గ్యాస్ ఒక అంతస్తు నుంచి ఇంకొక అంతస్తుకు సరఫరా చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇలా పంపించిన గ్యాస్ లీక్ అవ్వడంతో ఆ బిల్డింగ్ మొత్తం వ్యాపించి చిన్న విద్యుత్ స్పార్క్ రావడంతోనే మంటలు ఎగిసి పడ్డాయి. పై అంతస్తులో ఉన్న రియాక్టర్ కూడా పేలిందని తెలింది.
ఓవైపు మంటలు, మరోవైపు రియాక్టర్ పేలడంతో గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్, గోడ కుప్పకూలాయి. దీంతో మృతు సంఖ్య ఎక్కువ అయింది. ప్రమాదం ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని చెట్లలో పుట్లలోకి కూడూ దూసుకెళ్లాయి. ఇలా గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు ఛిద్రమైపోయాయి.
ప్రమాదం గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు వెంటనే అధికారులతో మాట్లాడారు. వైద్యాధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. ఇవాళ ఆయన అనకాపల్లి, వైజాగ్‌లో పర్యటించి క్షతగాత్రులను,
Telangana Group 2 Exam Schedule: డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణ గ్రూప్ 2
Latest Telangana Group 2 Exam Schedule: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణ గ్రూప్ 2 పరీక్షను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో నిర్వహించనున్నారు. ఉదయం పది నుంచి 12.30 వరకు మొదటి పేపర్ పరీక్ష ఉంటుంది. సాయంత్రం 3 గంటల నుంచి నుంచి ఐదు వరకు రెండో పేపర్ నిర్వహిస్తారు.
Andhra Pradesh: మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఉంటే చంద్రబాబు కబుర్లు చెప్తున్నారు: జగన్ ట్వీట్
Jagan: ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవన్నారు వైసీపీ అధినేత జగన్. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయన్నరు. వైయస్సార్‌సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయని తెలిపారు. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెప్తున్నారని ఎద్దేవా చేశారు.
ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా రాష్ట్రంలో లేవు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. వైయస్సార్‌సీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టాయి, వాహనాలను ధ్వంసం చేశాయి. కిందిస్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే,… pic.twitter.com/Bx35uodt4P
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 22, 2024
Kavitha: తిహార్ జైలులో కవితకు అస్వస్థత- ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు
Telangana: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. వెంటనే ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి వైద్యపరీక్షలు చేస్తున్నారు.
Chandra Babu: మెడికోవర్ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు
Chandra Babu: ఏపీ సీఎం చంద్రబాబు మెడికోవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఫార్మా ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శిస్తున్నారు.
Hyderabad: సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ
Telangana News: జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.