అన్వేషించండి

Block VPN: 'వీపీఎన్'లను బ్యాన్ చేయండి.. కేంద్రానికి స్టాండింగ్ కమిటీ సిఫార్సు

హోంశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్రానికి కీలక సిఫార్సు చేసింది. దేశంలో వినియోగిస్తోన్న వీపీఎన్ లను బ్యాన్ చేయాలని కోరింది. జాతీయ భద్రత కోణంలో దీనిపై సరైన నిర్ణయం తీసుకోవాలని తెలిపింది.

వీపీఎన్ లను బ్యాన్ చేయాలని కేంద్రానికి హోంశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. ఈ సర్వీసుల వల్ల ఎంతోమంది నేరగాళ్లు వివిధ కార్యకలాపాలు సాగిస్తున్నారని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహకారంతో హోంశాఖ ఈ వీపీఎన్ లను గుర్తించి శాశ్వతంగా బ్లాక్ చేయాలని ఈ కమిటీ కోరింది. ఈ వీపీఎన్ లను శాశ్వతంగా బ్యాన్ చేసేందుక అంతర్జాతీయ ఏజెన్సీల సహకారం కూడా కావాలని వెల్లడించింది.

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత దేశంలో ముఖ్యంగా ఐటీ పరిశ్రమ వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేస్తోంది. ఇందుకోసం కంపెనీలు వీపీఎన్ లను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఇందుకోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ విధించిన రూల్స్ ను కూడా కాస్త సడలించింది. అయితే ఇప్పుడు అవే వీపీఎన్ లను బ్యాన్ చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది.

వీపీఎన్ అంటే?

వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్​వర్క్. ఇది యూజర్లకు, ఇంటర్నెట్​కు మధ్య సురక్షితమైన కనెక్షన్ అందిస్తుంది. వీపీఎన్​ ద్వారా మనం సెకండరీ నెట్​వర్క్​కు కనెక్ట్ అవుతాం. బ్రాడ్​బ్యాండ్​లో మన ఇంటర్నెట్ యాక్టివిటీని వీపీఎన్ నెట్​వర్క్​ పూర్తిగా అడ్డుకుంటుంది. ఇతర సైట్లు, నెట్​వర్క్​లు మన బ్రౌజింగ్ యాక్టివిటీని చూడకుండా చేస్తుంది. రిమోట్ వర్కింగ్ కోసం వీపీఎన్​ను సంస్థలు ఉపయోగిస్తుంటాయి. పనికి సంబంధించిన సమాచారాన్ని, ఫైళ్లను ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసే వీలు దీని ద్వారా కలుగుతుంది.

ఎవరికీ దొరకదు..

వీపీఎన్ నెట్​వర్క్​ వినియోగించే వారికి ఎలాంటి భయం ఉండదు. ఎవరూ ట్రాక్ చేసే వీలే లేదు. ఇది ఫోన్​ను ప్రైవేట్ సర్వర్లకు కనెక్ట్ చేస్తుంది. తద్వారా యూజర్ల ఐపీ అడ్రెస్ ఇతర నెట్​వర్క్​లకు కనిపించదు. డివైజ్ నుంచి వెళ్లే సమాచారాన్ని ఎన్​క్రిప్ట్ చేస్తుంది. ఏ నెట్​వర్క్​, సైట్ వీటిని గుర్తించలేవు. సైబర్ సెక్యూరిటీ నుంచి కూడా దీని ద్వారా తప్పించుకోవచ్చని కమిటీ తన నివేదికలో పేర్కొంది. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదని పేర్కొంది.

గల్వాన్ ఘర్షణ అనంతరం జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం చైనాకు చెందిన పలు యాప్ లను ఇప్పటికే బ్యాన్ చేసింది. మరి ఈ వీపీఎన్ లపైన కూడా ఎదైనా యాక్షన్ తీసుకుంటుందేమో చూడాలి.

Also Read: Dengue Fever in UP: యూపీలో మిస్టరీ ఫీవర్.. 40 మందికి పైగా మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget