అన్వేషించండి

Bengal Assembly Elections: బీజేపీ అభ్యర్థిని వెంటపడి మరీ కొట్టారు - బెంగాల్ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు - వీడియో

West Bengal election: తొలి విడత ఎన్నికల్లో బెంగాల్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కుమార్ గంజ్ స్థానంలో బీజేపీ అభ్యర్థిని టీఎంసీ కార్యకర్తలు వెంటపడి కొట్టారు.

BJP candidate manhandled allegedly by TMC workers:  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కుమార్‌గంజ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన ఆయనను అడ్డుకుని, భౌతికంగా దాడి చేయడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
 
గురువారం  నియోజకవర్గంలోని బూత్ నంబర్ 24 వద్ద గందరగోళం జరుగుతోందన్న సమాచారంతో సువేందు సర్కార్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఆయనను చుట్టుముట్టి నెట్టివేస్తూ, దాడికి దిగారు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఆయన పొలాల గుండా పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన వెంట సెక్యూరిటీగా ఉన్న పోలీసు అధికారి ఆందోళనకారుల నుంచి ఆయనను రక్షించేందుకు విఫలయత్నం చేశారు. తమ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారని అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఈ దాడి జరిగిన సమయంలో అక్కడ కేంద్ర బలగాలు ఎవరూ లేరని సువేందు సర్కార్ ఆరోపించారు. పోలింగ్ కేంద్రం లోపల భద్రతా దళాలు ఉన్నాయి కానీ, బయట మమ్మల్ని చుట్టుముట్టి కొడుతుంటే రక్షించే వారు లేరు  అని ఆయన పేర్కొన్నారు. తమ ఏజెంట్లను కూడా బలవంతంగా బూత్‌ల నుంచి వెళ్లగొడుతున్నారని, దీనిపై ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని ఆయన మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.   


దక్షిణ దినాజ్‌పూర్‌తో పాటు ఉత్తర బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం, ప్రత్యర్థి పార్టీల ఏజెంట్లను అడ్డుకోవడం వంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందుతున్నాయి. అసిన్సోల్ దక్షిణ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని అగ్నిమిత్ర పాల్ కారుపై కూడా రాళ్ల దాడి జరగడం పోలింగ్ రోజున నెలకొన్న ఉద్రిక్తతకు నిదర్శనంగా నిలిచింది.   


 ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం కొట్టిపారేసింది. బీజేపీ అభ్యర్థులు సానుభూతి కోసమే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు శాంతియుతంగా ఓటు వేస్తున్నారని పేర్కొంది. ఎన్నికల సంఘం ఈ ఘటనలపై స్పందిస్తూ వివరణ కోరినట్లు సమాచారం. ఈ గొడవలు జరిగినప్పటికీ, దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల సమయానికే 81% పైగా పోలింగ్ నమోదు అయింది. 

టాప్ హెడ్ లైన్స్

Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Aurora Venkateswara Swamy Temple Mass Shooting Plot: అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో మారణకాండకు కుట్ర - 19 ఏళ్ల శ్వేతజాతి ఉన్మాది అరెస్ట్!
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion: కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?
కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ హఠాత్ రాజీనామా - మోదీ కేబినెట్ విస్తరణకు వేళాయెనా?

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Embed widget