Dharmasthala Case Update: ధర్మస్థల పుణ్యక్షేత్రం గురించి జరిగిందంతా తప్పుడు ప్రచారమే - హత్యలపై ఫిర్యాదు చేసిన మాజీ ఉద్యోగి అరెస్ట్
Dharmasthala: కర్ణాటకలోని పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల కొద్దీ హత్యలు జరిగాయని ఫిర్యాదు చేసిన వ్యక్తిని సిట్ అరెస్టు చేసింది. తప్పుడు ఫిర్యాదు చేశాడని గుర్తించారు.

Dharmasthala Case Complainant Arrested : ధర్మస్థలలో వందల మందిని హత్య చేశారని..తానే వాటిని కాల్చివేయడం లేదా పూడ్చి పెట్టడం చేశానని ఫిర్యాదు చేసిన చిన్నయ్య అలియాస్ చెన్న అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అబద్దాలు చెప్పి.. తప్పుదోవ పట్టించాడని.. కుట్ర చేశాడని ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచింది.
#Dharmasthala Mask man arrested by SIT. Shiva tandava has just begun.
— Chakravarty Sulibele (@astitvam) August 23, 2025
We are strong on ground. Will not stop till the masterminds behind this come to light..
Jai Mahadev pic.twitter.com/0gieNjBzPa
2024 జూలైలో చెన్న పోలీస్ స్టేషన్‌లోకి ఒక పుర్రెను తీసుకువచ్చి, ధర్మస్థల లో " మహిళల శవాలు సహా వందలాది శవాలను పూడ్చివేయడానికి సహాయం చేశాను" అని పోలీసులకు చెప్పాడు. తనను పాపభావం వెంటాడుతోందని.. రక్షణ ఇస్తే స్థలాలు చెప్పి సాక్షిగా మారుతానని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అతను గతంలో కొంత కాలం అక్కడ పారిశుధ్య కార్మికునిగా పని చేశారు. ఆయన "విజిల్ బ్లోయర్"గా చెప్పుకుని ధర్మస్థల గ్రామంలో "సామూహిక బలాత్కారాలు, హత్యలు" జరిగాయని ఫిర్యాదుచేశాడు. శవాలను సామూహికంగా పూడ్చివేశామని చెప్పాడు. తనతో పాటు ఓ పుర్రెను కూడా సాక్ష్యంగా తీసుకు వచ్చాడు. దీంతో కర్ణాటకలో దుమారం రేగింది. అక్కడి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ధర్మస్థలలో అతను చెప్పిన చోటల్లా తవ్వినా.. ఎక్కడా మానవ అవశేషాలు బయటపడలేదు.
చివరికి తాను తప్పు చెప్పానని ఓ వ్యక్తి పుర్రెను ఇచ్చి .. అలా ఫిర్యాదు చేయమన్నాడని మాట మార్చారు. అలాగే.. తన కుమార్తె ధర్మస్థలకు వెళ్లి కనిపించలేదని ఆరోపణలు చేసిన సుజాత భట్ అనే మహిళ కూడా మాట మార్చారు . తనకు అసలు అనన్య పేరుతో కూతురు లేదని.. కేవలం ఓ వివాదం కారణంగా ఒత్తిడికి లోనై, అలా చెప్పాల్సి వచ్చిందని చెప్పింది. లక్షలాది మంది. భక్తులు వచ్చే ప్రాంతం కావడం.. అది ఓ ట్రస్ట్ అధీనంలో ఉండటంతోనే ఈ వివాదం అంతా ప్రారంభమయింది. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తోంది. కానీ ఎక్కడా ఆ పని మనిషి చెప్పిన మానవ అవశేషాలు లభించలేదు. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల అవశేషాలు లభించలేదు. ఒక్క పురుషుడికి సంబంధించిన అస్థిపంజరం మాత్రం నదీ తీరంలో లభించిందని చెప్పుకున్నారు. ఆ తరవాత ఎన్ని చోట్ల తవ్వకాలు జరిగినా బయటపడిందేమీ లేదు. కానీ ఈ ఆలయంపై జరిగిన తప్పుడు ప్రచారాలు జరిగాయి.
కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల వివాదంలో కీలక మలుపు చోటు చేసుకుంది. తాను అసలు గత పదేళ్లుగా కర్ణాటకలోనే లేనని.. వందల మందిని పాతి పెట్టినట్లుగా ఫిర్యాదు చేసిన వ్యక్తి రివర్స్ అయ్యాడు. ఓ వ్యక్తి తనతో అబద్దాలు చెప్పించాడని.. అతనే పుర్రెను కూడా ఇచ్చాడని రివర్స్ వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ధర్మస్థల కథ మారింది. దేవుడిపై ఎంతో భక్తి ఉంటేనే .. ట్రస్ట్ ను నడుపుతారు. హెగ్డే కుటుంబం అధీనంలో ఉన్న ధర్మస్థలపై గతంలోనూ చాలా మంది వివాదాలు రేపే ప్రయత్నం చేశారు. దాన్నో రాజకీయ ఆయుధంగా మార్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వస్తున్నాయి.





















