Tata Punch Latest Version: టాటా పంచ్ లెటెస్ట్ వెర్షన్ రెడీ.. వావ్ అనిపించే ఫీచర్లు.. ఫోర్ వీలర్ మార్కెట్లో తాజా సంచలనం
టాటా పంచ్ ను లాంచ్ చేసి మూడేళ్లు పూర్తి చేసుకున్నందున టాటా మోటార్స్ ఆ కారులో కొన్ని మార్పులు చేసి, లేటెస్ట్ మోడల్ ను తీసుకొస్తోంది. ఇందులో మరిన్ని నూతన ఫీచర్లను యాడ్ చేసినట్లుగా తెలుస్తోంది.

Tata Punch Latest News: తన బెస్ట్ సెల్లర్స్ కార్లలో ఒకటైన టాటా పంచ్ కార్ కు మరిన్ని హంగులు దిద్దేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. లాంచ్ అయిన మూడు సంవత్సరాల తర్వాత కారులో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును పూర్తి చేసిన టాటా మోటార్స్ త్వరలోనే ఈ వెర్షన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 2021లో ప్రారంభించిన తర్వాత, పంచ్ మిడ్-లైఫ్ మేకోవర్ పొందడం ఇదే మొదటిసారి. దీనిని ధృవీకరిస్తూ, టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ యొక్క టెస్ట్ మ్యూల్ పూణేలో టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో కారు ప్రియులలో టాటా పంచ్ లో ఎలాంటి మార్పులు చేశారో అని ఆసక్తి వెల్లడైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కారుకు సంబంధించిన నూతన ఫీచర్ల గురించి చర్చ జరుగుతోంది.
Here’s a quick glimpse of the Tata Punch ICE facelift
— MotorBeam (@MotorBeam) July 1, 2025
Expected to get styling tweaks and features borrowed from its EV sibling including the updated interior
Likely to be launched ahead of the festive season pic.twitter.com/xDjE2npUno
అధునాతన హంగులు..
బయటి వైపు చూస్తే, పంచ్ నూతన మోడల్ లో చాలా వరకు ఒకే మాదిరిగా ఉంది. కనెక్ట్ చేయబడిన LED DRL లతో పాటు స్ప్లిట్-టైప్ హెడ్‌ల్యాంప్ అసెంబ్లీని పొందుపరిచారు.. కారు ముందు, వెనకాల ఉన్న బంపర్ యూనిట్లు కూడా రీస్టైల్ చేశారు. అంతేకాకుండా, అల్లాయ్ వీల్ డిజైన్ కూడా ఛేంజ్ చేసినట్లు తెలుస్తోంది. లోపలి భాగంలో, టాటా పంచ్ 10.25-అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను బదులుగా 7-అంగుళాల యూనిట్‌ను పొందుపరిచినట్లు సమాచారం. టాటా పంచ్ మధ్యలో ప్రకాశవంతమైన బ్రాండ్ లోగోతో 2-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుందని, స్పై షాట్‌ల ద్వారా తెలుస్తోంది. కొత్త మోడల్ వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్, వెనుక AC వెంట్స్, ఫాస్ట్ USB ఛార్జర్ ,మరిన్ని ఇంటీరియర్ ఫీచర్‌లను చాలా వరకు అప్ గ్రేడ్ చేశారు.
భద్రతలో..
ముఖ్యమైన సెక్యూరిటీ విషయానికొస్తే 6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడి ఉండటంతో పాటు మరిన్ని ఫీచర్లను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది పెట్రోల్ మరియు CNG రెండింటిలోనూ లభిస్తుంది. దీని ద్వారా రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయని, అటు పెట్రోల్ తో పాటు ఇటు సీఎన్జీ తో రెండు రకాల ఇంధనాలను వాడవచ్చని కంపెనీ చెబుతోంది. 3-పాట్ సెటప్‌తో 1.2L NA పెట్రోల్ యూనిట్ ప్రస్తుతం 87.8 hp గరిష్ట పవర్ అవుట్‌పుట్ తో లభిస్తోంది. దీనిలో 5-స్పీడ్ MT లేదా 5-స్పీడ్ AMTని పొందుపరిచారు. కొత్తగా రీ మోడలింగ్ చేసినందున పంచ్ నూతన వెర్షన్ ధర సుమారు రూ. 30,000 నుంచి50,000 వరకు పెరగవచ్చు. కంపెనీ అధికారికంగా ప్రకటన ఇచ్చిన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.





















