Ola S1 Pro Sport Scooty News: కారులో ఉండే ఫీచర్ ఇప్పుడు స్కూటీలో కూడా.. ఓలా విప్లవాత్మక మోడల్.. షేకవుతున్న ఇండియన్ ఈవీ స్కూటీ మార్కెట్
ప్రతీ మోడల్ కు ఫీచర్లు, రేంజీని పెంచుకుంటూ పోతున్న ఓలా తాజాగా ఇండిపెండెన్స్ డే సందర్బంగా సరికొత్త వేరియంట్ ను లాంచ్ చేసింది.కేవలం కార్లలో ఉండే ఒకనోక అద్బుత ఫీచర్ ను స్కూటీకి కూడా యాడ్ చేసింది.

Ola S1 Pro Sport Scooty's ADAS Feature Latest News: ఈవీ స్కూటీలలో రోజురోజుకి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఓలా కంపెనీ తాజాగా మరో సరికొత్త వేరియంట్ ను పరిచయం చేసింది. ఇప్పటివరకు కార్లలో మాత్రమే లభ్యమవుతున్న ఒక సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చి, బైక్ మార్కెట్ సెగ్మెంట్ ను షాక్ కు గురి చేసింది. మరోవైపు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ నిరంతరం పెరుగుతోంది.
పెట్రోల్‌తో నడిచే వాహనాల కంటే ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్‌ను చూసి, దాంతో పాటు సరికొత్త ఫీచర్లను యాడ్ చేసి ఓలా ఎలక్ట్రిక్ తన కొత్త వేరియంట్ గా ఓలా S1 ప్రో స్పోర్ట్‌ను విడుదల చేసింది. ఈ మోడల్లో ప్రత్యేకత ఏమిటంటే ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి హై-టెక్ సేఫ్టీ టెక్నాలజీని ఈ స్కూటీలో పొందుపరిచింది. దీంతో ఇండియన్ ఈవీ మార్కెట్లో ఈ ఘనత సాధించిన మొదటి స్కూటర్ గా నిలిచింది..
Meet the new S1 Pro Sport
— Ola Electric (@OlaElectric) August 15, 2025
All-rounder. All-sport.#IndiaInside #Sankalp2025 #OlaElectric pic.twitter.com/BOZBC3LysT
రూ.999తో బుకింగ్..
ఇండిపెండెన్స్ డే ఆఫర్ గా ఈ మోడల్ ను ఓలా పరిచయం చేసింది. 15 ఆగస్టు 2025న ఓలా S1 ప్రో స్పోర్ట్‌ను విడుదల చేసింది. . అయితే ఈ స్కూటీల డెలివరీ జనవరి 2026 నుండి ప్రారంభమవుతుంది. కస్టమర్లు కేవలం రూ. 999 చెల్లించి ఈ స్కూటర్‌ను వెంటనే రిజర్వ్ చేసుకోవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఓలా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రత్యేకంగా స్పోర్టీ లుక్‌తో రూపొందించింది. దీనికి స్ట్రీట్-స్టైల్ ఫెయిరింగ్ ఉండటంతో, సరికొత్త లుక్కులో కనిపించనుంది. అలాగే ఇందులో కార్బన్ ఫైబర్ ఉపయోగించ బడింది, దీంతో ఈ స్కూటీ మరింత తేలికగా ఉండబోతోంది.
అన్ బీటబుల్ ADAS ఫీచర్..
నిజానికి, ఈ స్కూటర్ యొక్క ట్రేడ్ మార్క్ దాని ADAS భద్రతా వ్యవస్థ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా ఈ ఫీచర్ కార్లలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ, దీన్ని స్కూటీలకు కూడా ఓలా అందుబాటులోకి తెచ్చింది. యాక్సిండెంట్ కదలికలను, బ్లైండ్ స్పాట్ గురించి, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ బోర్డుల గుర్తింపు వంటి లక్షణాలను కలిగి ఉండటం వలన ఇందులో రైడింగ్ ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్‌లో కంపెనీ 5.2 కిలోవాట్ల బ్యాటరీని పొందుపరిచింది. ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, స్కూటర్ రేంజీ 320 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా. దీంతో దేశంలోని లాంగెస్ట్ రేంజీ కలిగిన స్కూటీలలో ఇది ఒకటిగా నిలవనుంది.





















