అన్వేషించండి

Volvo Latest Ev Entry Level Premium Car:  వోల్వో నుంచి ప్రీమియం ఎంట్రీ లెవ‌ల్ ఈవీ కారు.. క‌ళ్లు చెదిరే ఫీచ‌ర్లు..!! ఆ కార్ల‌కు గ‌ట్టిపోటీ..!

అధునాత‌న‌మైన ఫీచ‌ర్లు.. అద్భుత రేంజీతో వోల్వో మ‌రో కారును రంగంలోకి దించింది. ప్రీమియం ఈవీ కార్ల విభాగం ఎంట్రీ లెవల్లో స‌త్తా చాటాల‌ని వోల్వో భావిస్తుంది. కారుకు సంబంధించిన ఫీచ‌ర్లు..

Volvo EV Car  Latest News:  రోజురోజుకు పెరుగుతున్న భార‌త‌ ఈవీ మార్కెట్ పై విదేశీ కంపెనీలు క‌న్నేశాయి. తాజాగా వోల్వో ఈ విభాగంలో స‌రికొత్త అప్డేట్ తో ముందుకు వ‌చ్చింది.   లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో ఇండియా తన కొత్త ఎలక్ట్రిక్ SUV EX30 టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ కారు త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందని ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత వోల్వో ఎలక్ట్రిక్ లైనప్ EX40 , EC40 కంటే EX30 వోల్వో ఈవీ కారు చిన్నదిగా ఉంటుంది. ఎంట్రీ-లెవల్ ప్రీమియం EV సెగ్మెంట్ కోసం ప్రత్యేకంగా కంపెనీ రూపొందించింది.. కాంపాక్ట్ సైజు మరియు ఆధునిక డిజైన్ యువ కొనుగోలుదారులను మరింత ఆకర్షిస్తాయ‌ని కంపెనీ న‌మ్మ‌కంగా ఉంది. ఈ వేరియంట్ ద్వారా ప్రీమియం ఎంట్రీ లెవ‌ల్లో మార్కెట్ ను కైవ‌సం చేసుకోవాల‌ని కంపెనీ భావిస్తోంది.

స్టైలిష్ ఫీచర్లు..
అనాది గా వోల్వో అంటే వినియోగ‌దారుల్లో ఒక క్రేజ్ ఉంది.   సొగసైన మరియు మినిమలిస్ట్ డిజైన్‌కు ఈ కంపెనీ ప్రసిద్ధి చెందింది. అదే కోవ‌లో EX30ని తీసుకువ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.  ఈ కారులో అనేక ఆక‌ర్ష‌ణ‌లను పొందుప‌రిచారు. LED హెడ్‌ల్యాంప్‌లు, క్లోజ్డ్ గ్రిల్ , ప్రత్యేకమైన టెయిల్‌లైట్‌లతో చూడ‌టానికి సూప‌ర్బ్ లుక్ తో వ‌స్తోంది. ఈ హంగులు దీనికి ప్రీమియం మరియు క్లాసీ అప్పీల్‌ను ఇస్తాయని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇంటీరియర్ విషయానికొస్తే.. దీని క్యాబిన్ చాలా చిన్న‌దిగా, హైటెక్ గా ఉంది. ఇందులో పెద్ద 12.3-అంగుళాల  టచ్‌స్క్రీన్ ముందర‌ ఇన్‌స్టాల్ చేయబడింది. ఇది గూగుల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది, దీనిలో గూగుల్ మ్యాప్స్,  యూట్యూబ్ వంటి ఇత‌ర‌ యాప్‌లు అందుబాటులో ఉంటాయి.

సూప‌ర్బ్ రేంజ్..
వోల్వో EX30 SEA ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు.  ఈ కారు 69 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుందని అంచ‌నా. ఈ SUV ఒకే ఛార్జ్‌పై దాదాపు 474 కిలోమీటర్ల రేంజ్ ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అటు లోక‌ల్ గా తిర‌గ‌డంతోపాటు కాస్త దూర ప్రాంతాల వారికి కూడా ఈ రేంజీ స‌రిపోతుంది. ఇందులో ఉన్న ఫాస్ట్ చార్జింగ్ ఫీచ‌ర్ ద్వారా బ్యాటరీ తక్కువ సమయంలో ఛార్జ్ అవుతుంది. వోల్వో EX30 ను ఇండియాలో స్థానికంగా అసెంబుల్ చేస్తే, దాని ధర రూ. 40 నుండి 50 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ ధరతో ప్ర‌త్య‌ర్థి కంపెనీల‌కు చెందిన BMW iX1, హ్యుందాయ్ ఐయోనిక్ 5 , కియా EV6 వంటి ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్లకు గ‌ట్టి పోటీని ఇస్తుంది. . దీని స్టైలిష్ డిజైన్, హై-టెక్ ఫీచర్లు మరియు లాంగ్ రేంజ్ ఇండియ‌న్ ప్రీమియం EV మార్కెట్‌లో బలమైన పోటీదారుగా మారుస్తుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
Gurram Papireddy OTT : ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
Gurram Papireddy OTT : ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
Lenin Movie Songs : విలేజ్ క్యూట్ లవ్ సాంగ్ - వహ్వా అనిపించేలా 'లెనిన్' వారెవా వారెవా లిరిక్స్
విలేజ్ క్యూట్ లవ్ సాంగ్ - వహ్వా అనిపించేలా 'లెనిన్' వారెవా వారెవా లిరిక్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
The Raja Saab vs Jana Nayakudu: జన నాయకుడు వాయిదా... ప్రభాస్ 'ది రాజా సాబ్'కు లాభమే - 'దిల్' రాజు సేఫ్
జన నాయకుడు వాయిదా... ప్రభాస్ 'ది రాజా సాబ్'కు లాభమే - 'దిల్' రాజు సేఫ్
Embed widget