Tata Punch New Features: టాటా పంచ్ కు మరిన్ని అదనపు ఫీచర్లు.. కలర్ ఫుల్ వేరియంట్లు.. రేంజీ పెరిగేలా న్యూ టెక్నాలజీ..
దేశ ఈవీ మార్కెట్ లో తన జోరును మరింత కొనసాగించాలని టాటా మోటార్స్..తన పంచ్ కార్ మోడల్లో మరిన్ని మార్పులు చేసింది. అటు అదనపు కలర్స్ తోపాటు ఇటు టెక్నాలజీ పరంగా సూపర్ గా డెవలప్ చేసింది.
Tata Motors Latest News: ఎలక్ట్రిక్ కార్లలో దూసుకుపోతున్న దేశీ దిగ్గజ సంస్థ తమ ఫ్లాగ్ షిప్ మోడలైన టాటా పంచ్ ఈవీలో తాజాగా సరికొత్త మార్పులు చేసింది. దీంతో ఈ రంగంలో తమ జోరు మరింత కొనసాగుతోందని కంపెనీ ఆశిస్తోంది. తాజాగాం పంచ్ మోడల్ రెండు కొత్త కలర్ వేరియెంట్లలో అందుబాటులోకి రానుంది. అలాగే లాంగ్ రేంజ్ వేరియంట్లలో చార్జింగ్ సమయాన్ని తగ్గించే వినూత్న మార్పుకు శ్రీకారం చుట్టింది. అయితే ఇవి తప్ప మిగతా విభాగాలైన డిజైన్, ఇంటియర్ లలో ఎలాంటి మార్పులు చేయాలని కంపెనీ పేర్కొంది. ఇకపై టాటా పంచ్ కారు ప్యూర్ గ్రే, సూపర్నోవా కాపర్ కలర్లలో అందుబాటులో ఉండనుంది. ఈ రెండు కలర్లకు బ్లాక్ రూఫ్ ఇచ్చామని కంపెనీ తెలిపింది. గతంలో టాటా పంచ్ కార్.. ఎంపవర్డ్ ఆక్సైడ్, సీవీడ్, ఫియర్లెస్ రెడ్, డేటోనా గ్రే, ప్రిస్టీన్ వైట్ కలర్లలో లభ్యం అయ్యేది.
వేగంగా.. త్వరగా..
ఈవీ కార్లలో అందరు ఎదుర్కొనే సమస్య.. చార్జింగ్ కు సమయం తీసుకోవడం. పెట్రో ఇంధన కార్లైతే నిమిషాల్లో ఇంధనం నింపుకుంటే సరిపోతుంది, కానీ, ఈవీ కార్లలో చార్జింగ్ కు సమయం కేటాయించడం కాస్త ఇబ్బంది కలిగిస్తోంది. అయితే ఈ సమస్యకు టాటా మోటార్స్ చెక్ పెట్టింది. లాంగ్ రేంజ్ వెర్షన్లలో త్వరగా చార్జింగ్ అయ్యే టెక్నాలజీని డెవలప్ చేసింది. డీసీ ఫాస్ట్ చార్జింగ్ సెటప్ సాయంతో బ్యాటరీ చార్జింగ్ 10 నుంచి 80 పర్సెంట్ గా అయ్యే సమయాన్ని 40 నిమిషాలకి తగ్గించింది. గతంలో ఇందుకు 56 నిమిషాల సమయం పట్టేది. అలాగే పబ్లిక్ డీసీ ఫాస్ట్ చార్జర్ పాయింట్లలో 90 కిమీ అదనపు రేంజీని కేవలం 15 నిమిషాల్లోనే సాధించవచ్చని పేర్కొంది.
సింగిల్ చార్జ్ లో..
ఇక లాంగ్ రేంజీ వెర్షన్లలో శక్తివంతమైన బ్యాటరీని యూజ్ చేసినట్లు కంపెనీ తెలిపింది. 35కిలోవాట్స్, 122 పీఎస్, 190ఎన్ఎమ్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఈ వెర్షన్ లో పొందు పరిచినట్లు పేర్కొంది. ఒక్కసారి చార్జ్ చేసినట్లయితే 365 కిమి రేంజీ లభిస్తుంది. ఇక మీడియం రేంజీ వెర్షన్లో 25 కిలోవాట్స్ , 82 పీఎస్, 144 ఎన్ఎం మోటార్ ను వాడగా, ఇది 265 కిమీ రేంజీని ఇస్తుంది. ఇక గత వెర్షన్లలాగే ట్విన్ 10.25 ఇంచ్ స్క్రీన్లు, వైర్లెస్ అండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్ తదితర ఫీచర్లు ఉండనున్నాయి. వీటితోపాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఏయిర్ ప్యూరిఫయర్, యాంబియెంట్ లైటింగ్, ఆరు ఏయిర్ బ్యాగులు, అల్ వీల్ డిస్క్ బ్రేక్ తదితర విలక్షణమైన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఇ
క టాటా పంచ్ కార్ల ధరలు 9.99 నుంచి 14.44 లక్షల రూపాయల రేంజీలో అందుబాటులో ఉంటున్నాయి. ఇవన్నీ ఎక్స్ షోరూం ధర వివరాలు కాగా, పన్నులతో కలిసిన ఆన్ రోడ్ ధర మరింత ఎక్కువగా ఉండనుంది. ఆన్ లైన్ తో పాటు టాటా డీలర్ల వద్ద ఈ కార్లను బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే కొత్త వేరియంట్లను డెలీవరి చేసే అవకాశముందని తెలుస్తోంది.





















