Biden-Xi talks: పెద్ద వార్నింగే ఇది.. 'తైవాన్ జోలికొస్తే భస్మం చేస్తాం'.. బైడెన్‌కు జిన్‌పింగ్ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి దానికి బైడెన్ ఎలా స్పందించారో తెలుసా?
అమెరికా- చైనా మధ్య మళ్లీ మాటల మంటలు రాజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ నిన్న వర్చువల్‌గా సమావేశం అయ్యారు. అయితే చర్చ మొత్తం సాఫీగానే సాగినప్పటికీ తైవాన్ విషయంలో మాత్రం ఇరువురి మధ్య మాటల యుద్ధం నడిచినట్లు తెలుస్తోంది. తైవాన్ జోలికి వస్తే నిప్పుతో చెలగాటమాడినట్లేనని బైడెన్‌కు జిన్‌పింగ్ హెచ్చరిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఏం అన్నారు?
వాషింగ్టన్ నుంచి బైడెన్, బీజింగ్ నుంచి జిన్‌పింగ్ సుమారు మూడున్నర గంటల పాటు వర్చువల్‌గా సమావేశమయ్యారు. వారి మధ్య మర్యాదపూర్వకంగా, సూటిగా సంభాషణలు జరిగినట్లు సమాచారం. అయితే తైవాన్ టాపిక్ వచ్చేసరికి సంభాషణ మారినట్లు తెలుస్తోంది.
బైడెన్ రిప్లై..
జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలపై బైడెన్ వ్యూహాత్మకంగా స్పందించారు.
చైనా ఒన్ నేషన్ పాలసీ అంటే చైనా ఒకే రాజ్యంగా గుర్తించడం. యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పడం ద్వారా అటు చైనాకు, ఇటు తైవాన్‌కు జో బైడెన్ సమాధానం ఇచ్చారు. యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంటూ చైనా సార్వభౌమత్వంలో జోక్యం చేసుకోబోమని చెప్పారు. అలాగే, తైవాన్ స్వాతంత్ర్యాన్ని అంగీకరించడం లేదని ఇది వరకే ఉన్న అమెరికా పాలసీని మరోసారి పునరుద్ఘాటించారు. చైనా యథాతథ స్థితిని ఉల్లంఘిస్తే.. తైవాన్‌కు ఆయుధాలు పంపే తన ప్రకటనకూ నర్మగర్భంగా సమర్థించుకున్నారు.
Also Read: Purvanchal Expressway Inauguration: 'వాళ్లు యూపీకి అన్యాయం చేశారు.. అందుకే శాశ్వతంగా దూరమైపోయారు'
Also Read: WHO on Covid 19: కరోనా థర్డ్ వేవ్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు.. లైట్ తీసుకోవద్దని హెచ్చరిక
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,865 కరోనా కేసులు.. గత 287 రోజుల్లో ఇదే అత్యల్పం
Also Read: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి
Also Read: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం
Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Also Read: వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి