Biden on Ayman Al-Zawahiri: అమెరికన్ల జోలికొస్తే వెంటాడి, వేటాడి చంపుతాం: బైడెన్ మాస్ వార్నింగ్
Biden on Ayman Al-Zawahiri: అల్‌ఖైదా చీఫ్ అల్- జవహరీని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు.
Biden on Ayman Al-Zawahiri: అమెరికన్లకు హాని కలిగిస్తే ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా వెతికి మరీ మట్టుపెడతామని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీని హతమార్చినట్లు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు. అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో జవహరీని మట్టుబెట్టినట్లు ఆయన తెలిపారు.
I made a promise to the American people that we’d continue to conduct effective counterterrorism operations in Afghanistan and beyond.
— President Biden (@POTUS) August 2, 2022
We have done that. pic.twitter.com/441YZJARMX
వార్నింగ్
ఈ ఆపరేషన్‌పై ట్విటర్‌లోనూ బైడెన్ స్పందించారు. అమెరికా ప్రజల జోలికొస్తే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
The United States continues to demonstrate our resolve and our capacity to defend the American people against those who seek to do us harm.
— President Biden (@POTUS) August 2, 2022
Tonight we made clear:
No matter how long it takes.
No matter where you try to hide.
We will find you.
టార్గెట్ కంప్లీట్
ఈ ఆపరేషన్‌కు బైడెన్ జులై 25న ఆమోదం తెలిపినట్లు సమాచారం. అఫ్గాన్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ ఆపరేషన్‌ను అమెరికా సైన్యం విజయవంతంగా చేపట్టింది. జవహరీ కాబుల్‌లోని తన నివాసంలో బాల్కనీలో ఉండగా రెండు హెల్‌ఫైర్ క్షిపణులు అతడిని లక్ష్యంగా చేసుకున్నాయి.
కేవలం జవహరీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టడంతో భవనంలోని ఒక అంతస్తు మాత్రమే ధ్వంసమైంది. ఈ దాడిలో కేవలం జవహరీ మాత్రమే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం అమెరికా పెద్ద కసరత్తే చేసింది. జవహరీ దినచర్యను దగ్గరుండి పరిశీలించేందుకు ఓ అధికారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. బాల్కనీలో నిల్చున్నది జవహరీ అని ఆ అధికారి కన్ఫమ్ చేసిన తర్వాతే దాడి చేసింది. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో జవహరీ ఒకడు. లాడెన్ హతమైన తర్వాత అల్‌ఖైదా పగ్గాలను జవహరీ చేపట్టాడు.
Also Read: Al-Qaeda Chief Killed: అమెరికా డ్రోన్ అటాక్, అల్ ఖైదా అధినేత అల్ జవహరీ హతం
Also Read: Bengaluru News: భార్య చేసిన చికెన్ పకోడా తిని ఆమెను పొడిచి భర్త ఆత్మహత్య!