Bengaluru News: భార్య చేసిన చికెన్ పకోడా తిని ఆమెను పొడిచి భర్త ఆత్మహత్య!
Bengaluru News: భార్య చేసిన చికెన్ పకోడా బాలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
Bengaluru News: బెంగళూరులో దారుణ ఘటన జరిగింది. భార్య చేసిన చికెన్ పకోడా తిని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు భార్యను కత్తితో పొడిచి పరారయ్యాడు.
ఇదీ జరిగింది
బెంగళూరు బన్నేరుఘట్ట పోలీసు స్టేషన్ పరిధిలో గత గురువారం ఈ ఘటన జరిగింది. అయితే వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సురేశ్ (48) అనే వ్యక్తి బొమ్మనహళ్లిలోని గార్మెంట్స్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. చికెన్ కబాబ్ చేయాలని భార్య షాలిని (42)ని అడిగాడు. అయితే ఆమె చేసి ఇచ్చింది.
బాాలేదని
అయితే ఆశగా చికెన్ పకోడా నోట్లో పెట్టుకున్నాడు సురేశ్. అసలు రుచిగా లేదని కోపపడ్డాడు. ఆగ్రహంతో భార్యను చితకబాదాడు. అంతటితో ఆగని సురేశ్.. కత్తితో భార్య తల, చేతులపై దాడిచేసి పరారయ్యాడు. షాలిని కేకలు విని ఇరుగుపొరుగు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు.
చివర్లో ట్విస్ట్
చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని షాలిని వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న భర్త సురేశ్ కోసం గాలించారు. అయితే సురేశ్ ఇంటికి సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఓ చెట్టు కొమ్మకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మరో ఘటన
రాజస్థాన్ బన్స్వారా జిల్లాలో ఇటీవల ఓ మహిళను ఆమె భర్త చెట్టుకి కట్టి 7 గంటల పాటు చిత్ర హింసలకు గురి చేశాడు. ఇందుకు భర్త తరఫు బంధువులు కూడా సాయం చేశారు. ఆ మహిళ.. దెబ్బలకి తట్టుకోలేక కేకలు పెడుతున్న కనికరించలేదు.
భార్యను తన స్నేహితుడితో ఉండటం చూసిన ఆమె భర్త ఆగ్రహవేశాలకు లోనై ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతో కనిపించిన వ్యక్తిని కూడా చెట్టుకు కట్టి ఇలానే హింసించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) రాజస్థాన్ డీజీపీకి లేఖ రాసింది. ఆ లేఖలో ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్ రేఖా శర్మ నిందితులందరినీ వెంటనే అరెస్టు చేయడమే కాకుండా బాధితురాలికి తగిన వైద్యం అందించి, భద్రత కల్పించాలని అధికారులను కోరారు.
వెంటనే స్పందించిన పోలీసులు బాధితురాలి భర్త, బావతో సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Corona Cases: దేశంలో తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 13 వేల మందికి వైరస్
Also Read: Monkeypox Case India : దిల్లీలో మరో మంకీపాక్స్ కేసు, నైజీరియన్ కు పాజిటివ్