బెంగళూరు మైసూరు ఎక్స్‌ప్రెస్ వే జలమయం, గత వారమే ప్రారంభించిన ప్రధాని - వాహనదారుల అసహనం
Bengaluru-Mysuru Expressway: కర్ణాటకలో కురిసిన వర్షాలకు బెంగళూరు మైసూరు ఎక్స్‌ప్రెస్ వేలో నీళ్లు నిలిచిపోయాయి.
Bengaluru-Mysuru Expressway:
వారం క్రితమే ప్రారంభించిన ప్రధాని
వారం రోజుల కింద ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభించారు. అయితే...కర్ణాటకలో కురిసిన వర్షాలకు ఈ రోడ్‌లో నీళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చాలా వెహికిల్స్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. అసహనం వ్యక్తం చేసిన వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి కాస్తా వైరల్ అయ్యాయి. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలూ మొదలయ్యాయి. దీనిపై స్పందించిన NHAI వీలైనంత త్వరగా ఈ నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. సోషల్ మీడియాలో మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
"వాన నీళ్లు వెళ్లిపోవడానికి మేం ప్రత్యేకంగా కొంత స్పేస్ అలాగే ఉంచాం. కానీ కొంత మంది గ్రామస్థులు వాటిని మట్టితో నింపేశారు. అందుకే ఇలా వరద వచ్చింది. నీళ్లు నిలిచిపోయాయి. వీటిని తొలగిస్తున్నాం. త్వరలోనే రూట్ క్లియర్ చేస్తాం"
- NHAI
గతేడాది ఆగస్టులోనూ వర్షాలు పడినప్పుడు ఇదే దారిలో భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. టెక్నికల్ టీమ్ ఈ సమస్యను పరిష్కరిస్తుందని ఈ ఏడాది జనవరిలో పర్యటించిన సమయంలో హామీ ఇచ్చారు. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకే కట్టుబడి ఉన్నామని వివరించారు. కానీ ఇప్పుడు మళ్లీ ఇదే హైవేలో నీళ్లు నిలిచిపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Newly inaugurated Bengaluru-Mysuru Highway by Narendra Modi. It’s condition after 6 days of inauguration. Masterstroke. pic.twitter.com/xa04AB62HK
— Shantanu (@shaandelhite) March 18, 2023ఈ నెల 12న బెంగళూరు - మైసూరు హైవేను ప్రారంభించారు. దీంతో పాటు మరి కొన్ని రోడ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 118 కిలోమీటర్ల బెంగళూరు-మైసూరు రోడ్ నిర్మాణం కోసం కేంద్రం రూ.8,480 కోట్లు ఖర్చు చేసింది. గతంలో బెంగళూరు నుంచి మైసూరు వెళ్లాలంటే కనీసం 3 గంటల సమయం పట్టేది. ఈ హైవేతో ఆ ప్రయాణ సమయం 75 నిముషాలకు తగ్గిపోనుంది. అంతే కాదు. మండ్య ప్రాంతంలోని అభివృద్ధిలోనూ ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ రోడ్ను ప్రారంభించిన తరవాత మైసూరు-కుశాల్నగర్ 4 లేన్ హైవే నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు 92 కిలోమీటర్ల మేర సాగే ఈ హైవే నిర్మాణం కోసం రూ.4,130 ఖర్చవుతుందని అంచనా. ప్రయాణ సమయం కూడా 5 గంటల నుంచి 2.5గంటలకు తగ్గిపోనుంది. ఇది పూర్తైతే... బెంగళూరు, కుశాల్నగర్కు కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ హైవేను ప్రారంభించిన తరవాత ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు.
"కొన్ని రోజుల క్రితం బెంగళూరు మైసూరు హైవే ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి వైరల్ అయ్యాయి. ఈ అభివృద్ధిని చూసి యువత ఎంతో గర్విస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులన్నీ మన దేశ పురోగతికి బాటలు వేస్తాయి."
- ప్రధాని నరేంద్ర మోదీ
Also Read: సరిహద్దులో అంతా ప్రశాంతంగానే ఉంది, అయినా సైనిక మొహరింపులు మాత్రం ఆగవు - ఆర్మీ చీఫ్