Bengaluru: అక్కడి స్కూల్స్‌లో క్లికింగ్ పెన్స్‌పై బ్యాన్, ఆ సౌండ్ చిరాకు పుట్టిస్తోందట
Bengaluru: బెంగళూరులోని కొన్ని స్కూల్స్‌లో క్లికింగ్ పెన్స్‌పై నిషేధం విధించారు.
Bengaluru Clicking Pens Ban:
బెంగళూరు స్కూల్స్‌లో బ్యాన్..
ఎగ్జామ్ హాల్స్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలని చాలా స్ట్రిక్ట్‌గా చెబుతారు ఇన్విజిలేటర్లు. ఏ మాత్రం శబ్దం చేసినా వెంటనే విద్యార్థులకు వార్నింగ్ ఇస్తారు. బెంగళూరులోని ఓ స్కూల్‌లో ఈ రూల్‌ని మరీ కఠినంగా అమలు చేస్తున్నారు. ఎంతలా అంటే క్లికింగ్ పెన్స్‌ని బ్యాన్ చేసేంతలా. క్లికింగ్ పెన్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. పెన్ చివర్లో ఓ నిబ్ ఉంటుంది. "టిక్ టిక్" మంటూ వాటిని నొక్కుతూ రాయడం చాలా మంది అలవాటు. ఏ పనీ తోచనప్పుడు కూడా ఆ క్లికింగ్ పెన్‌ని వాడేస్తుంటారు. కానీ బెంగళూరులోని కొన్ని స్కూల్స్ మాత్రం ఈ "టిక్ టిక్" పెన్‌లపై నిషేధం విధించింది. ఈ సౌండ్ వల్ల అందరికీ డిస్టర్బెన్స్ అవుతోందని చెబుతోంది. అంతే కాదు. విద్యార్థుల తల్లిదండ్రులకు సర్క్యులర్ కూడా పంపింది. "మీ పిల్లలకు క్లికింగ్ పెన్స్ ఇచ్చి ఎగ్జామ్స్‌కి పంపకండి" అని తేల్చి చెప్పింది.
ఈ క్లికింగ్ పెన్స్ కారణంగా తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని కొందరు తల్లిదండ్రులే కంప్లెయింట్ ఇచ్చారట. అందుకే కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నాయి.
"ఈ పెన్‌ని క్లిక్ చేస్తే తప్ప విద్యార్థులు పరీక్షలు రాయలేరు. కానీ అందరూ కంటిన్యుయస్‌గా ఎగ్జామ్ రాయరు కదా. ఆ ఖాళీ సమయంలో ఊరికే ఆ పెన్‌ని క్లిక్ చేస్తూ ఉంటారు. ఈ శబ్దం చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. సమాధానం తెలియనప్పుడు కొందరు విద్యార్థులు పదేపదే వాటిని క్లిక్ చేస్తుండటం మేం గమనించాం. ఇన్విజిలేటర్‌లు వార్నింగ్ ఇస్తున్నా కొందరు విద్యార్థులు ఆ అలవాటు మానుకోవడం లేదు"
- ఓ స్కూల్ యాజమాన్యం
ఈ నిర్ణయంపై కొందరు విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము క్లిక్ పెన్స్‌తో పరీక్షలు రాయడం అలవాటైందని, ఉన్నట్టుండి మానుకోవాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
"మేం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ పెన్ అయితే వాడతామో అదే పరీక్షల్లోనూ వినియోగిస్తాం. అలా అయితేనే మాకు సౌకర్యంగా ఉంటుంది. బాల్ పాయింట్ పెన్స్‌కి అయితే క్యాప్ ఉంటుంది. పదేపదే దాన్ని తీసి పెట్టలేం కదా. అందుకే క్లికింగ్ పెన్స్ వాడుతున్నాం. పేపర్ చినిగిపోకుండా జాగ్రత్తపడాలన్నా ఈ క్లికింగ్ పెన్స్ వాడడమే మంచిది"
-ఓ విద్యార్థి
పెన్ క్యాప్‌కు రంధ్రం ఎందుకు..?
పెన్ను వాడిన సందర్భంలో కాస్త నిశితంగా ఎప్పుడైనా గమనించారా. పెన్ను క్యాప్ పైభాగంలో ఒక రంధ్రం ఉందని మీరు చూసే ఉంటారు. ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రంధ్రం ఎందుకు పెట్టిఉంటారో మీకు తెలియదా? ఈ రంధ్రం పెట్టడం సైన్స్ మీకు తెలుసా. ఒక వాదన ప్రకారం, పెన్ను మూసి తెరిచినప్పుడు క్యాప్‌కు ఉన్న హోల్ గాలి పీడనాన్ని సమానంగా నిర్వహిస్తుంది. క్యాప్ తీసి పెట్టే పెన్నులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పెన్ను రీఫిల్‌లోని సిరా ఎండిపోకుండా ఉండటానికి కొన్ని రకాల పెన్నుల మూతకు రంధ్రాలు చేస్తారని చాలా మంది అనుకుంటారు. ఇది సరైన వాదన కాదని చాలా మంది వాదన.వాస్తవానికి పెన్ను మూతలో రంధ్రం చేయడానికి ప్రాథమిక కారణం ఏమిటంటే కొంతమంది పెన్ను మూతతో సహా, దానిని నోటిలో నములుతుంటారు. ముఖ్యంగా పిల్లలు అలా చేస్తారు. అటువంటి పరిస్థితిలో, అది ప్రమాదవశాత్తు నోటిలోకి వెళితే, రంధ్రాలు లేకపోవడం వల్ల గాలి ప్రవాహం ఆగిపోతుంది. ఇది ప్రాణాంతకం. ఈ కారణంగా తయారీదారులు దాని మూతకు రంధ్రం చేయడం ప్రారంభించారు.