ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భారత్‌పై కెనడా ఆరోపణలు! వెలుగులోకి సంచలన విషయం
India Canada Issue: ఓ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భారత్‌పై కెనడా ఆరోపణలు చేస్తున్నట్టు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
![ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భారత్‌పై కెనడా ఆరోపణలు! వెలుగులోకి సంచలన విషయం Based on Five Eyes Intelligence, Canada accused India of Killing Nijjar, Says Report ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భారత్‌పై కెనడా ఆరోపణలు! వెలుగులోకి సంచలన విషయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/24/a9fe4231894593b67e29ac65050350b81695546091244517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India-Canada Issue:
ఇంటిలిజెన్స్ రిపోర్ట్..
భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలోనే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన తరవాత అమెరికా నిఘా వర్గాలు కెనడాకి కీలక సమాచారం అందించినట్టు న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఇదే విషయాన్ని అమెరికా దౌత్యవేత్త కూడా ధ్రువీకరించారు. Five Eyes Partners అందించిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే కెనడా భారత్‌పై ఆరోపణలు చేసినట్టు వెల్లడించారు. నిజ్జర్ హత్యకు, భారత్ ప్రభుత్వానికి కచ్చితంగా లింక్ ఉండే ఉంటుందని ఆ నివేదిక వెల్లడించినట్టు సమాచారం. అందుకే ట్రూడో ఆ వ్యాఖ్యలు చేశారు. కెనడాలోని CTV News Channel కూడా ఈ విషయాన్ని కన్‌ఫమ్ చేసింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలతో కూడిన Five Eyes Partners కూటమి నిఘా సమాచారాన్ని అందిస్తుంటుంది. సెప్టెంబర్ 18వ తేదీన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్యకి, భారత్‌కి లింక్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల్ని భారత్ కొట్టి పారేసింది. 2020లోనే నిజ్జర్‌ని భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయితే...కెనడాలోని CTVకి ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలోనే అమెరికన్ డిప్లమాట్ డేవిడ్ కొహెన్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. నిజానికి చాలా రోజులుగా ఈ వాదన వినిపిస్తోంది. ఓ నిఘా వర్గం కెనడాకి సమాచారం అందించిందని, ఆ తరవాతే ట్రూడో ఇలా కామెంట్స్ చేశారన్న వార్తలు వచ్చాయి. కానీ...అధికారికంగా ఓ అమెరికా దౌత్యవేత్త ఈ విషయం వెల్లడించడం ఇదే తొలిసారి.
"Five Eyes" అందించిన రిపోర్ట్ ఆధారంగానే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై ఆరోపణలు చేశారు. భారత్ కెనడా మధ్య రోజురోజుకీ వివాదం ముదురుతోంది. భారత్ వీసా సేవల్ని నిలిపివేసింది. ఈ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి"
- డేవిడ్ కొహెన్, అమెరికా దౌత్యవేత్త
ఎవరు అందించారు..?
అయితే...ఈ ఇంటిలిజెన్స్ సమాచారం రెండు విధాలుగా అందేలా ఏర్పాటు చేసుకున్నాయి 5 దేశాలు. ఒకటి surveillance-based వ్యవస్థ. మరోటి signals intelligence. దీన్నే SIGNITగానూ పిలుస్తారు. ఇప్పుడు కెనడాకి అందిన సమాచారం ఈ రెండు వ్యవస్థల్లో దేని నుంచి అందింది అన్నది క్లారిటీ లేదు. డేవిడ్ కొహెన్ కూడా దీనిపై కామెంట్ చేయలేదు. ఇక కెనడా ఛానల్ CTV మరో విషయమూ చెప్పింది. Canadian Broadcasting Corporation (CBC) తోపాటు The Associated Press కీలక విషయం చెప్పినట్టుగా ప్రస్తావించింది. కేవలం కెనడా నిఘా వర్గాలు మాత్రమే కాకుండా...ఈ Five Eyesలోని ఓ దేశం సీక్రెట్‌గా ఈ సమాచారాన్ని అందించినట్టుగా వెల్లడించింది. అంటే...ఆ నిఘా కూటమిలోని ఏదో ఓ దేశం కెనడాకి వివరాలు ఇచ్చింది. కానీ ఏ దేశం ఈ పని చేసిందన్నది మాత్రం రహస్యంగానే ఉంది. అటు అమెరికా దౌత్యవేత్త డేవిడ్ కోహెన్ ఇంతకు మించి ఏమీ మాట్లాడలేదు. కొన్ని విషయాల్ని బహిరంగంగా చర్చించడం సరికాదని సమాధానాలు దాటవేశారు. ఇదంతా చూస్తుంటే..పక్కా ప్లాన్‌తో భారత్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలకు తావిస్తోందంటున్నారు కొందరు విశ్లేషకులు.
Also Read: కెనడాలో భారతీయ విద్యార్థుల టెన్షన్, ఎలా ఉన్నారో అని గాబరా పడుతున్న తల్లిదండ్రులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)