Delhi Farmers Protest : ఏ క్షణమైనా ఢిల్లీ రైతుల ఉద్యమం ముగింపు ..అన్ని డిమాండ్లకూ ఓకే చెప్పిన కేంద్రం !
ఢిల్లీలో ఏడాదికిపైగా ఉద్యమం చేస్తున్నరైతులు తమ ఆందోళన విరమించే అవకాశం కనిపిస్ోతంది. వారి డిమాండ్లకు కేంద్రం ఓకే చెప్పింది.
ఢిల్లీ శివార్లలో ఏడాదికిపైగా ఉద్యమం చేస్తున్న రైతులు శాంతించే అవకాశం కనిపిస్తోంది. ఏ క్షణమైనా వారు ఉద్యమాన్ని విరమిస్తున్నట్లుగా ప్రకటించే అవకాశం ఉంది. ఉద్యమాన్ని నడిపిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ప్రతిపాదిత సవరణలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వం పంపిన ముసాయిదా ప్రతిపాదనలకు ఎస్‌కేఎం సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి కేంద్రానికి పంపింది. కిసాన్ మోర్చా పంపిన సవరణలకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీనిపై ఎస్‌కేఎంలోనూ ఏకాభిప్రాయం కుదిరింది.
Also Read : దిల్లీ రోహిణి కోర్టులో పేలుడు.. ఏం జరిగిందంటే?
కేంద్ర ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక ఆర్డర్ అందిన తర్వాత రైతు ఉద్యమం ముగింపుపై ప్రకటన చేస్తారు. సింఘూ సరిహద్దు వద్ద ఎస్‌కేఎం నేతలు ఉద్యమం ముగింపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. రైతు ఉద్యమం సమయంలో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హిమా చల్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లో రైతులపై అక్రమంగా బనాయించిన కేసులను రైతు ఉద్యమం ముగించిన తరువాత ఉపసంహరించుకుం టామని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. ముందు కేసులు ఉపసంహరించుకోవాలనీ, ఆ తర్వాతే ఉద్యమం ఆపుతామంటూ ఎస్‌కేఎం సవరణ కోరింది. వెంటనే కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
Also Read : తదుపరి త్రివిధ దళాధిపతిగా ఆయనే .. త్వరలో అధికారిక ప్రకటన !
ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం కేసులను ఉపసంహరించుకుంది. అలాగే రైతులకు పరిహారానికి సంబంధించి.. హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయని కేంద్రం ప్రతిపాదించింది. దానికి సూత్రప్రాయ అంగీకారం కాదనీ, కేంద్రమే ఆ రెండు రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని సూచించింది. పంటలకు కనీస మద్దతు ధర పై చట్టపరమైన హామీ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామనీ రైతు సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు ఉంటారని ప్రభుత్వ ప్రతిపాదన తెలిపింది.
Also Read : ఎట్టకేలకు హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం.. డీకోడింగ్ కోసం తరలింపు.. వీడియో
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినప్పటికీ రైతులు మాత్రం ఉద్యమాన్ని ఆపేది లేదని ప్రకటించారు. కేసుల ఉపసంహరణ, చనిపోయిన రైతులకు పరిహారం, కనీస మద్దతుధరకు చట్టబద్ధత వంటి అంశాలపై పోరాడారు. రైతుల ఉద్యమాన్ని ఎలాగైనా ముగించాలని అనుకుంటున్న కేంద్రం.. వారి డిమాండ్లన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి